ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వ్యాక్సిన్లపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే 7 కోట్ల డోసులు కావాలని, వాటిని ఎలాగైనా తెచ్చి ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యానిచారు.

అయితే మొదటి ప్రయారిటీ మాత్రం 45 ఏళ్ళు దాటిన్వ్ వారికి ఇస్తున్నామని అన్నారు. గ్లోబల్ టెండర్లకు పిలిచినా మొట్టమొదటి రాష్ట్రం ఏపీ అని మరోసారి గుర్తు చేసారు. రెండవ విడతలో మిగలిన వారందరికీ వ్యాక్సిన్లు వేస్తామని స్పష్తం చేసారు. అయితే దీనిపై అన్ని నిజాలు తెలిసినా కూడా కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు సీఎం జగన్.





























