Extra Jabardasth : ఏ వివాదాన్నైనా సోషల్ మీడియాలో రోస్ట్ చేసుకోవడం ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. ఇక జబర్దస్త్ సంగతి చెప్పక్కర్లేదు. కరెంట్ ఇష్యూపై పంచులు వేస్తుంటారు. ఇక ఈ వారం జబర్దస్త్ కు అతిధిగా అనిల్ రావిపూడి f3 సినిమా ప్రచారం కోసం వచ్చారు. ఇక ఈషోలో రీసెంట్ గా జరిగిన ఒక వివాదాన్ని నరేష్, కెవ్వు కార్తీక్ స్కిట్ చేసి నవ్వించారు. ఇంతకీ వాళ్ళు చేసిన స్కిట్ ఏంటో తెలుసా….

దేవి నాగవల్లి గెట్ అవుట్ పదాన్ని వాడి నవ్వించిన నరేష్……

ఇటీవల హీరో విశ్వక్ సేన్, టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన వివాదంలో నాగవల్లి, విశ్వక్ వాడిన పాదాలను వాడుతూ స్కిట్ చేసారు. ఇక ఈ వివాదాన్ని మాములుగా వాడలేదు విశ్వక్ సేన్, దేవి నాగవల్లి మధ్య సంభాషణను రిక్రీయేట్ చేస్తూ నవ్వించారు. కెవ్వు కార్తీక్ ను కుమ్మేసిన నరేష్ ఇక కార్తీక్ ఇదంతా ప్రీ ప్లాన్డ్ అంటూ అరవడం, ఇక నరేష్ దేవి నాగవల్లి డైలాగ్ గెట్ అవుట్ అంటూ చేయి చూపించడంతో, కెవ్వు కార్తీక్, విశ్వక్ సేన్ లాగా వాట్ ద అనబోతుంటే నో.. ఈ స్కిట్లో నుంచి గెటౌట్ అంటూ దేవి నాగవల్లిని ఇమిటేట్ చేసాడు నరేష్. దీంతో ఒక్కసారిగా నవ్వుల బాంబులు పేలాయి. ఇక అదే సందర్బంలో అనిల్ ఎక్స్ప్రెషన్స్ ఇది అదే అన్నట్టుగా పెట్టడంతో బాగా జోకులు పేలాయి. ఇపుడు ఈ ప్రోమో బాగా వైరల్ అయింది.



























