Anil Ravipudi : పటాస్ సినిమాతో కామెడీ పటాస్ లు లేపిన అనిల్ రావిపూడి ఆ తరువాత సరిలేరు నీకెవ్వరు అంటూ దూసుకొచ్చాడు ఈ గ్యాప్ లోనే ఫన్ అండ్ ఫెస్ట్రేషన్ అంటూ ఫ్యామిలీ కామెడీతో బాగా నవ్వించాడు. ఇక మరోసారి f3 సినిమాతో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ ఫ్యామిలీ మొత్తాన్ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

నాకు మూడు ఫ్యామిలీలు……
F3 సినిమా విడుదలయి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరిన్ కలిసి నటించిన ఈ చిత్రం లో డబ్బులు సంపాదించుకోవడం కోసం ఫ్రస్ట్రేషన్ అండ్ ఫన్ ను డైరెక్టర్ చక్కగా చూయించాడు. ప్రదీప్, మురళి కృష్ణ, ప్రగతిల, అన్నపూర్ణ, వైజయంతిల కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక సినిమా ప్రమోషన్స్ లోనే అనిల్ రావిపూడి సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎంటర్టైన్మెంట్ పక్కా రాసిపెట్టుకోండి అంటూ హామీ ఇచ్చేసాడు. అందుకు తగ్గట్టే సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

ఇక అనిల్ రావిపూడి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేశాయని అలాగే ఇపుడు F3 కోసం కూడా థియేటర్లకు వస్తున్నారని, వాటి సరసన F3 ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తనకు మూడు ఫ్యామిలీలని మీకు నచ్చినట్లు థంబ్ నైల్స్ పెట్టుకోండి అంటూ సోషల్ మీడియా మీమర్స్ కు చెప్పారు. ఒక ఫ్యామిలీ ఇంట్లో ఉంటే మరొకటి F3 ఫ్యామిలీ, మరొకటి ప్రేక్షకులు అంటూ తన మూడు ఫ్యామిలీలను వివరించాడు అనిల్. ఇక F3 విజయం తరువాత అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు.

































