Anitha nagaraj : 2008 ఆ ప్రాంతంలో యువతను బాగా ఆకట్టుకున్న పాట అనిత ఓ అనిత ఒక సినిమా పాటకూడా అంత వేగంగా ప్రాచుర్యం పొందదేమో అన్నట్లుగా అనిత అనే పాట ఆకట్టుకుంది. అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్స్ అంత అందుబాటులో లేకపోయినా ఈ పాట అందరికి చేరువయింది. అప్పట్లో ఈ పాట ఎవరు రాసారో, ఎక్కడినుండి ఈ పాట వచ్చిందో ఎవరికీ తెలియ్యక పోయిన ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో ఆ పాట రాసి పాడిన నాగరాజ్ అందరికి పరిచయమాయ్యడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగరాజ్ ఈ పాట స్వయంగా తానే రాసి పాడటం విశేషం. ఇక ఈ పాటకు సంబంధించిన అనేక విషయాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో నాగరాజ్ పంచుకున్నారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను తెలియజేశారు.

ఆర్థిక సహాయం చేస్తానన్న టీడీపీ నేత మాగంటి రూప….
ఈటెల రాజేందర్ గారి ఊరు అయిన కమలాపురం పక్కన చిన్న గ్రామం నాగరాజు గారిది. పీజీ చెసిన ఆయన ఈ పాటతో బాగా ఫేమస్ అయిన కూడా ఆ ఫేమ్ ని సద్వినియోగం చేసుకోలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఊర్లోనే పాన్ షాప్ పెట్టుకుని కుటుంబ పోషణ నిర్వహిస్తున్నారు. ఆయనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కాగా ఇద్దరు పిలల్లో ఒకరు మూగ ఒకరు చెవిటి కావడం బాధాకరం. ఇద్దరికి వైద్యం చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ స్థోమత లేక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

ఇద్దరు అబ్బాయిలకు ఇలా సమస్య ఉండటంతో వారి బాధ వర్ణనతీతం. అయితే యూట్యూబ్ ఛానెల్ అయిన సుమన్ టీవీ చొరవ తో యాంకర్ రోషన్ టీడీపీ మహిళా నేత మురళి మోహన్ గారి కోడలు అయిన మాగంటి రూప గారికి నాగరాజ్ గారి సమస్య చెప్పి సహాయం చేసేలా చేసారు. అలా మాగంటి రూప గారు పిల్లల వైద్యనికి అయ్యే ఖర్చు తానే భరిస్తానని మాటిచ్చారు. దీంతో అనిత నాగరాజ్ అలాగే ఆయన సతీమణి ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు.































