KGF : ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పవర్ ఫుల్ చిత్రమ్ కేజీఎఫ్ రెండు భాగాలుగా విడుదలయి ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలో ప్రతి పాత్ర సినిమాకు జీవం పోశాయి. మరీ ముఖ్యంగా రాకీ భాయ్ మరియు అతని తల్లి పాత్ర. ఇక ఈ పాత్రలో ఒక సాధారణంగా మనిషి ఒక డాన్ గా ఎదిగిన తీరు ఎలివేషన్ చాలా చక్కగా ఉంటాయి. ఇక ఈ పాత్రలో యష్ బాగా నటించారు. ఇక అతని తల్లిగా అర్చన జోయిస్ కూడా అంతే బాగా నటించి మెప్పించారు.

ఇక తల్లితో రాకీ భాయ్ అనుబంధాన్ని చూపించినపుడు యష్ చిన్నప్పటి పాత్రలో చేసిన కుర్రాడి గురించి కూడా ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ పాత్ర చేసింది 18ఏళ్ల అన్మోల్. యష్ చిన్నప్పటి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అన్మోల్ స్టంట్స్ డాన్స్ అంటే చాలా ఇష్టమట ఇక వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇక అన్మోల్ పడఖ అనే సినిమాలో నటించాడు.
ఇక ఈ సినిమాలో అన్మోల్ ని చూసి ప్రశాంత్ చిన్నప్పటి యష్ పాత్రకు సరిపోతాడని తీసుకున్నారట. సినిమాలో ఈ పాత్ర చిన్నదే అయినా కీలకమైనది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాకు ఆత్మ వంటి పాత్రలో అన్మోల్ చాలా చక్కగా నటించాడు. జూనియర్ రాకీ షాట్‌ల కోసం అన్మోల్‌కి 12 నెలలు పట్టింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నడ చిత్రం పడకలో కూడా పనిచేశాడు, అందులో అతను యంగ్ సురేష్ విశ్వనాథ్ అయ్యాడు.






























