దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, పాక్షిక లాక్ డౌన్ లను పాటిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో అన్నదానం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. విజయవాడ ఇంద్రకీలాద్రి, ద్వారకా తిరుమలతో పాటు పలు దేవాలయాల్లో అన్నదానం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అన్నదానం ఆగిపోయిన ఆలయాల్లో భక్తులకు ప్యాకెట్లలో భోజనం అందించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు భోజనాన్ని ప్యాకెట్లలో పంపిణీ చేయనుంది దేవాదాయ శాఖ.



























