బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుపై గతంలో బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రదీప్ హీరోగా నటించిన ‘౩౦ రోజుల్లో ప్రేమించడం ఎలా.?’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. అయితే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా 2 రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, ఇది నిబంధనలకి విరుద్దమని, ఈ సినిమా షూటింగ్ వెంటనే ఆపేయాలని యాంకర్ ప్రదీప్‌ పై మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన శ్రీ రామోజు సునిశిత్‌ అనే దర్శకుడు గతంలో బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇదిలావుండగా..

తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లో నమోదైన ఓ రేప్ కేసు సంచలనం సృష్టిస్తుంది. తనని 139 మంది రేప్ చేశారంటూ ఓ యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే ఆమె ఫిర్యాదు చేసిన 139 మంది జాబితాలో మన బుల్లితెర యాంకర్, టాలీవుడ్ సినిమా హీరో ప్రదీప్ మాచినేని పేరు కూడా వుండటంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పాతికేళ్ల యువతి.. గత కొన్ని రోజులుగా తనపై ఈ అత్యాచారాల సంఘటనలు జరుగుతున్నాయని.. 2009 నుంచి ఇప్పటి వరకూ తనని 139 మంది రేప్ చేశారని తనే స్వయంగా పోలీసు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ రేప్ కేసు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.
లేటెస్ట్ గా ఆ యువతి ఇచ్చిన కంప్లైంట్ తో 113 పేజీలతో FIRను నమోదు చేశారు పంజాగుట్టు పోలీసులు. అయితే ఈ FIR లో కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

14 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకున్న ఆ యువతి.. తన భర్తతో మనస్ఫర్ధలు రావడంతో అతనితో విడిపోయి.. అప్పటికే విద్యార్థి సంఘ నాయకులతో ఉన్న పరిచయాల ఆధారంగా హైదరాబాద్ వచ్చానని, ఆ తర్వాత రాజ్ భవన్ రోడ్‌ లో వున్న ఓ అపార్ట్ మెంట్‌ లో అద్దెకు నివశిస్తుండగా.. గత కొన్ని రోజుల నుండి తనపై అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయని, ఒక్కరే కాకుండా గ్యాంగ్ రేప్‌లు కూడా చేశారని.. ఈమధ్యనే గర్భం దాల్చితే అబార్షన్ చేయించారని.. ఫోన్లలో తనను నగ్నంగా చిత్రీకరించి హింసించారని తనని 5000 సార్లు రేప్ చేసిన ఈ 139 మంది రేపిస్ట్‌ లలో తెలుగు రాష్ట్రాల వారే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారని.. ఎవరికైనా చెప్తే చంపేస్తాం అని బెదిరించడంతో తాను ఇంతవరకూ ఈ విషయాన్ని రహస్యంగా దాచానని, చివరికి ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో తానిప్పుడు ధైర్యంగా పోలీసు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేసినట్టుగా తెలియజేసింది ఆ యువతి.

ఆమెను రేప్ చేసిన వాళ్లలో ప్రముఖ యాంకర్ ప్రదీప్‌ తో పాటు టాలీవుడ్ కు చెందిన కొందరు సినీ నిర్మాతలు, ఓ కెమెరామెన్, ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్, మాజీ M.P, వాళ్ల P.A అలాగే ప్రముఖ డాక్టర్‌ తో పాటు SFI విద్యార్థి నాయకుల పేర్లు FIR లో నమోదయ్యాయి. వీళ్ళందరిపై నిర్భయ కేసుతో పాటు మరి కొన్ని సెక్షన్స్ క్రింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు మొదలు పెట్టారు పంజాగుట్ట పోలీసులు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రేప్ కేసులో బుల్లితెర యాంకర్ ప్రదీప్ పేరుపై FIR నమోదు కావడంతో ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. గతంలో డ్రంక్ & డ్రైవ్ కేసులో ముద్దాయిగా ఉన్న ప్రదీప్.. ఈ రేప్‌ కేసులో కూడా నిందితుడుగా నమోదు కావటంతో టాలీవుడ్ లో ఇప్పుడిదే పెద్ద సెన్సేషనల్ న్యూస్ గా అందరూ చర్చించుకుంటున్నారు. ఎవరో కావాలనే బుల్లితెర యాంకర్ ప్రదీప్ పేరును చెప్పమని ఆ యువతిని బలవంతం పెట్టారా.? లేక ఆమె చెప్పిందంతా నిజమేనా.? అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here