ఏపీలోని ఓటర్ల నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన వారు ఓటు నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అవకాశం కలిపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒకరు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరుకు జరగనుంది. నవంబర్ 1న జాబితాను విడుదల చేస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చనని ప్రకటనలో తెలిపారు.

పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గోనవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు. http://www.nvsp.in వెబ్ సైట్ ద్వారా కానీ ఓటర్ హెల్ప్‌లైన్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 20 నాటి వరుకు అభ్యంతరాల పరిశీలించి జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు































