డ్రగ్స్ కేసులో రకుల్‌ ప్రీత్‌ కు మరో ట్విస్ట్.. మళ్ళీ తెరపైకి 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు !!

0
180

సుశాంత్ సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ కేసులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తాజా పరిణామాలతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ రంగాలు కూడా ఉలిక్కిపడుతున్నాయి. ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్ననేపథ్యంలో డ్రగ్స్ వాడకం, సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా తాజాగా 25 మంది పేర్లను బయటపెట్టింది. గత 2 రోజులుగా డ్రగ్స్ మాఫియాతో ఉన్న లింక్ లను నార్కోటిక్ పోలీస్ లు బయటికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే నటి రియా బయట పెట్టిన పేర్లలో టాలీవుడ్ తారలు కూడా ఉన్నారని తెలుస్తోంది.

గతంలో 2017లో డ్రగ్స్ కేసులో 15 మంది టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై కేసు నమోదు చేసిన తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ అధికారులు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, మాస్ హీరో రవి తేజ, హీరోయిన్ ఛార్మి, తరుణ్, నవదీప్, ముమైత్ ఖాన్, సుబ్బరాజు,తనీష్ లతో పాటు మరికొందరిని విచారించారు. అందరి రక్తం, వెంట్రుకల నమూనాను సేకరించి పరీక్షలకు పంపారు. అనుమానితుల్లో చాలా మంది డ్రగ్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఛార్జ్ షీట్ లో కూడా సిట్ ఈ విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఆ తర్వాత ఆ కేసు క్రమంగా మందగమనంలోకి వెళ్లిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ నటి రియా చేసిన సంచలన కామెంట్స్ తో మరోసారి ఈ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈక్రమంలో డ్రగ్స్ లింకుల వ్యవహారం క్రమంగా టాలీవుడ్‌కూ విస్తరిచడంతో పాటు తెలుగు సినీ రంగం లోని ప్రముఖలు పేర్లు తెరపైకి వచ్చాయి.

రియా చక్రవర్తి నిత్యం డ్రగ్స్ తీసుకునే 25 మంది పేర్లను వెల్లడించగా అందులో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి ర కుల్ ప్రీత్‌సింగ్ పేరు తెరపైకి వచ్చింది. రియా తన బెస్ట్ ఫ్రెండ్స్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లను వెల్లడించడం సంచలనంగా మారింది. రకుల్‌తో పాటు మరో 10 మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తాజా సమాచారం. ఒక్కసారిగా రకుల్‌ప్రీత్ సింగ్ పేరు తెరపైకి రావడంతో వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నరకుల్ హుటాహుటిన షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆమెపై వస్తున్న ఆరోపణలను రకుల్ మేనేజర్ తీవ్రంగా ఖండించారు. కేవలం రకుల్ పై కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని వాదించారు. రియా తెలియజేసిన 25 మందికి నోటీసులు జారీచేసే ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై నార్కోటెక్ కంట్రోల్ బ్యూరో అత్యవసరంగా సమావేశమై డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదర్కొంటున్న వారికి నోటీసులు పంపిన అనంతరం జరిగే పరిణామాలపై చర్చించారు. బాలీవుడ్‌లో రియా అరెస్ట్‌తో మొదలైన పర్వం బెంగళూరులో బుజ్జిగాడు బ్యూటీ సంజనా వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొంత మందిని ఎన్‌సిబి అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here