టాలీవుడ్‌ లో కెమెరా మేన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఛోటా. కె. నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత కొన్నేళ్లుగా తనతో సహ జీవనం చేసి,
త‌న‌ను శారీర‌కంగా వాడుకుని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తగానే తనని కావాలనే మానశికంగా వేధిస్తూ.. మోసం చేశాడంటూ సాయి సుధ అనే సినీ జూనియర్ ఆర్టిస్ట్ S.R నగర్ పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా హైదరాబాద్‌ లోని S.R నగర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది. పోలీసులు శ్యామ్ కె నాయుడుని అరెస్ట్ చేశారు.

అయితే రిమాండ్‌ కు తరలించిన 2 రోజులకే శ్యామ్ కె నాయుడు బెయిల్ పై బైటకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. బెయిల్ మంజూరు కోసం శ్యామ్ కోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ నకిలీవేనని సాయి సుధ కోర్టుకు తెలియజేయడంతో సాయి సుధ, తానూ ఇద్దరం రాజీకొచ్చామని పేర్కొంటూ శ్యామ్ కె నాయుడు నాంపల్లి కోర్ట్ లో బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తు సాయి సుధ ఫోర్జరీ సంతకంతో చేసినట్టు విచారణలో తేలింది. తాజాగా నాంపల్లి కోర్టు శ్యామ్ కె నాయుడు బెయిల్ ను రద్దు చేసింది. శ్యామ్ కె నాయుడుపై ఫోర్జరీ కేసును కూడా నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించడం మరో ట్విస్ట్. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి వివాదం సంచలనం సృష్టించిన సంగతి నెటిజన్లందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదంలో లేటెస్ట్ గా మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. S.R నగర్ S.I కి 5 లక్షల లంచం ఇచ్చానంటూ జూనియర్ నటి సాయిసుధ బాంబ్ పేల్చింది. S.R. నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తన దగ్గర్నుంచి 5 లక్షలు లంచం తీసుకొని తనకు సరైన న్యాయం చేయలేదని ACB అధికారులను సాయి సుధ ఆశ్రయించడంతో ఈ కేసు క్రొత్త మలుపు తిరిగింది.

గతంలో ఈ కేసు విషయమై తాను S.R నగర్ ఇన్స్పెక్టర్ మురళికి 5 లక్షలు లంచం ఇచ్చానని, ఆ తర్వాతే పోలీసులు శ్యాం కె నాయుడుపై కేసు నమోదు చేశారని.. కానీ 2 రోజుల్లోనే అతడిని వదిలిపెట్టేశారని, ఈ కేసులో శ్యామ్ కోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చారని శ్రీ సుధా చెప్తుంది. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు.. ఆడియో రికార్డ్స్ కూడా తన వద్ద ఉన్నాయని ఈ కేసు విషయం కోసమే ACB అధికారులను కలిసి వచ్చానని సాయి సుధ తెలియజేయడంతో ఈ కేసు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మొత్తానికి శ్రీసుధ – శ్యామ్ కె నాయుడు లైంగిక వేధింపుల కేసు పోలీసుల మెడకు చుట్టుకోవడంతో ఈ వివాదంలో ఇంకెన్ని ట్విస్ట్‌లు చూడాల్సి వస్తుందోనని పోలీసులు నివ్వెరపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here