Ante Sundaraniki : వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10 న థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా మొదటి మూడు రోజులు పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది. హాస్య ప్రధానంగా సాగే ఈ సినిమాలో తొలిసారి మళయాళి భామ నాజ్రియా నటించారు. కథ పరంగా సున్నితమైన విషయాన్ని దర్శకుడు చూపిన తీరు బాగుంది. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే సినిమాకు వసూళ్లు ప్రస్తుతం తగ్గాయి.

బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే…..
సినిమా మొదటి మూడు రోజులు బాగానే వసూలు చేసినా ఆ తరువాత నుండి నెమ్మదించాయి. థియేటర్లలో 70 % సీట్లు ఖాళీగా ఉన్నాయి. సినిమా ఓటీటీ లో వచ్చాక చూద్దాంలే అని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందు విడుదలైన విక్రమ్ సినిమాకు ఇంకా జనం థియేటర్లకు వస్తున్నారు. నాని ఇటీవల సినిమా విడుదలయ్యాక ఇంటర్వ్యూలో కూడా అంటే సుందరానికి సినిమా ఆవకాయ లాంటింది. రోజు రోజుకి రుచి పెరిగినట్లే మెల్లగా సినిమాపై ఆదరణ పెరుగుతుందని, అందరికి నచ్చుతుందని చెప్పారు.

కానీ అలా జరగడం లేదు. సినిమా థియేటర్ల ముందు జనాలు పల్చబడ్డారు. ఇక ఈ వారం రానా, సాయి పల్లవి నటించిన విరాట పర్వం సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ప్రభావం అంటే సుందరానికి సినిమాపై ప్రభావం చూపవచ్చు. ఇక బ్రేక్ ఈవెన్ కూడా రావడం కష్టంగా ఉంది. ఇది ఇలాగే ఉంటే మైత్రి మూవీ మేకర్స్ కి నష్టాలు తప్పవని అంటున్నారు. శుక్రవారం విడుదలైన సినిమాకు సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల షేర్ వచ్చింది. మెల్లగా వసూళ్లు తగ్గడంతో నష్టాలు తప్పవని భావిస్తున్నారు.



























