తేనే తుట్టపై దాడికి వంతెన నిర్మించిన చీమలు.. చివరికి?

0
76

ఇప్పటివరకు మనం కేవలం మనుషులు మాత్రమే తన మేధా శక్తిని ఉపయోగించి ఎత్తయిన వంతెనలు, భవనాలు నిర్మిస్తామని భావిస్తాము. అయితే ఇప్పటి నుంచి ఈ ఆలోచన నుంచి బయటకు రావాలి. ఎందుకంటే కేవలం మనుషులు మాత్రమే కాకుండా జంతువులు కూడా తమలో ఉన్న తెలివి తేటలను అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. అవి కూడా వంతెనను నిర్మించగలవని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

సాధారణంగా చీమలు చూడడానికి ఎంతో చిన్నవిగా అనిపించిన అవి కష్టపడేతత్వం ఎంతో ఎక్కువగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆహారాన్ని సేకరించడంలో చీమలకు మరేదీ సాటి ఉండదు. ఒక్కసారి చీమలు వేటిపై అయినా దాడి చేశాయి అంటే కచ్చితంగా వాటిని సాధించి తీరుతాయి అనడానికి నిదర్శనమే ఈ వీడియో.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చీమలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చీమలు ఒక గోడ నుంచి వంతెనలా ఏర్పడి పక్కనే ఉన్న తేనెపట్టు పై దాడి చేశాయి. ఈ క్రమంలోనే తేనెపట్టు పై దాడి చేసి తేనెను ఆక్రమించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చీమలు ఒకదానికొకటి పట్టుకుని వేలాడుతూ ఒక వంతెన లాగా ఏర్పడ్డాయి.

ఈ విధంగా ఏర్పడిన వంతెన ద్వారా చీమలన్నీ తేనెపట్టును చేరుకొని అక్కడ ఉన్నటువంటి తేనెటీగలను తరిమి తేనెను ఆక్రమించుకున్నాయి. దూరం నుంచి చూస్తే ఇక్కడేదో గోడకు ఒక తాడు వేలాడినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళితే అది తాడు కాదు చీమలని దిమ్మతిరిగే నిజం బయట పడుతుంది.ఈ విధంగా చీమలన్నీ ఎంతో ఐకమత్యంతో ఆహారాన్ని పోగు చేసుకుని ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. మరెందుకాలస్యం ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here