Anu Mehatha : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే హిట్ కాంబినేషన్.. అది ‘ఆర్య’ సినిమాతోనే మొదలైపోయింది. ఆర్య సినిమా స్టోరీ అంతకుముందు సుక్కు ఎంతో మంది స్టార్ హీరోలకు చెప్పినా చివరకు బన్నీ దగ్గరికి చేరింది. ఇక బన్నీకి స్స్రిప్ట్ నచ్చడం సినిమా విడుదల అవడం ప్రేక్షకులకు నచ్చడం అన్ని చకచకా జరిగిపోయాయి. సినిమాలో డిఫరెంట్ గా లవ్ ని చూపించడంలో సుక్కు సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాలో బన్నీకి జోడిగా హీరోయిన్ గా అను మెహత నటించింది. మొదటి సినిమా అయినా ఆమె నటన, అందం అందరినీ ఆకట్టుకున్నాయి.

అను మెహత ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…
ఆర్య సినిమాలో ఇన్నోసెంట్ అమ్మాయి గా కనిపించిన అను గీత పాత్రలో ఒదిగిపోయింది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అను మెహత అంతకు ముందు మోడల్ గా రాణించి ఈ సినిమాతో ఒక్కసారిగా హీరోయిన్ అయింది. ఇక ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ సినిమాలో నటించిన అను దాదాపు తెలుగులో ఇక సినిమాలను చేయలేదు.

ఆ తరువాత తెలుగు ప్రేక్షకులకు కనిపించని అను సోషల్ మీడియా పుణ్యమా అని కనిపించింది. సముద్ర తీరాన అందాలను ఆరాబోస్తూ కనువిందు చేసి ఆశ్చర్య పరిచింది. గీత ఏంటి ఇలా మారిపోయింది అంటూ నెటిజన్స్ ఆశ్చర్య పోతున్నారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని గట్టి ప్లాన్ లో అమ్మడు ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది.



























