నాగార్జునకు షాక్.. బిగ్ బాస్ హోస్ట్ గా అనుష్క..!!

0
351

మూడు వారాల క్రితం తెలుగులో గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో నుంచి సూర్య కిరణ్, కరాటే కల్యాణి ఎలిమినేట్ కాగా ఈ వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జుననే నాలుగో సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులను కూడా నాగార్జున హోస్టింగ్ బాగానే ఆకట్టుకుంటోంది.

అయితే బిగ్ బాస్ హోస్ట్ మారుతున్నట్టు నాగార్జున స్థానంలో అనుష్క హోస్ట్ గా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కొంత సమయం పాటు అనుష్క హోస్ట్ గా కనిపించనుందని.. అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న నిశ్శబ్దం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ఈరోజు షోను హోస్ట్ చేయనుందని తెలుస్తోంది. గత సీజన్ లో నాగార్జునకు బదులుగా రమ్యకృష్ణ రెండు రోజుల పాటు బిగ్ బాస్ షోను హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అనుష్క బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తే తెలుగులో బిగ్ బాస్ షో హోస్ట్ చేసిన రెండో హోస్ట్ గా అనుష్కకు అరుదైన రికార్డ్ సొంతమయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఇప్పట్లో థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చాలాకాలం ఎదురు చూసిన నిశ్శబ్దం టీం చివరకు ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి సిద్ధమైంది. మాధవన్, అనుష్క ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా అంజలి కీలక పాత్ర పోషించింది.

చాలాకాలం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున, అనుష్క ఒకే ఫ్రేమ్ లో కనిపించే అవకాశాలున్నాయి. అనుష్క, నాగార్జున కాంబినేషన్లో చాలా సినిమాలు తెరకెక్కాయి. అనుష్క నాగార్జున సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనుష్క రాకతో బిగ్ బాస్ షోలో ఈరోజు మరింత సందడి నెలకొనే అవకాశాలు ఐతే పుష్కలంగా ఉన్నాయి.