ఆయన్నే పెళ్లి చేసుకుంటాను..!! పెళ్ళి విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన అనుష్క !!

0
311

తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై స్పందించింది అనుష్క. టాలీవుడ్, కోలీవుడ్ అంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా చెక్కు చెదరని అందంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తోంది. బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర ఆమెకు దేశమంతా అభిమానులను సంపాదించుకుంది. “బాహుబలి” సినిమా తరువాత ఆమె స్టేటస్ మరింత పెరిగింది. ఈ పాత్ర చేసిన ఆ పాత్రలో పరకాయ ప్రేవేశం చేసే అనుష్క గతంలో కూడా “అరుంధతి”, “రుద్రమదేవి”, “బాగమతి” వంటి అద్భుమతమైన చిత్రాలతో సూపర్ హిట్ సినిమాలతో ఎందరో అభిమానుల మనసులు కొల్లగొట్టింది.

కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న అనుష్క ప్రస్తుతం “కోనా ఫిలిం కార్పొరేషన్ బ్యానర్” మీద కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న “నిశ్శబ్దం” అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క తో పటు మాధవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తీ చేసుకునే పనిలో ఉంది.

అయితే ఈ చిత్రం గురించి మాట్లాడానికి మీడియా ముందుకు వచ్చిన అనుష్కని “మీరు ఎవరితోనో ప్రేమలో ఉన్నారట…” అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆ విలేఖరిపై ఫైర్ అయింది. మొన్నటి వరకు ప్రభాస్ తో పెళ్ళని వార్తలు క్రేయేట్ చేసారు. ఆ తరువాత స్వీటీ ఎవరినో లవ్ చేస్తుంది అన్నారు. ఇప్పుడు ఓ వ్యాపారవేత్తతో అనుష్క ప్రేమలో ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తల పట్ల తానూ విసిగిపోయానని, అసలు తన గురించి ఇలా వందతులు ఎందుకు క్రేయేట్ చేస్తున్నారో అర్ధంకావడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది అనుష్క. తనపై ఇలాంటి లేనిపోని ప్రచారం చేయడం బాధగా ఉందంటుంది. “మా తల్లిదండ్రులు ఎవరినైతే వివాహం చేసుకోమని చెబుతారో… అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది” అనుష్క.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here