అనుష్క శెట్టి.. ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సైడ్ హీరోయిన్ గా ఎంటర్ అయి స్టార్ హీరోయిన్ గా మారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనుష్క శెట్టి. అరుంధతి సినిమాలో మంచి ఫేమ్ సాధించారు. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ను సాధించుకున్నారు.

కానీ బాహుబలి తర్వాత ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమా ‘నిశ్శబ్దం’ సినిమా ఒక్కటే చేసింది.ఇటీవల యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా అనౌన్స్ చేసింది. అయితే ప్రస్తుతం ఆమె ప్రస్తుతం బొద్దుగా ఉంది. ఈ సినిమా కోసం ఆమె సైజ్ జీరో కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకు కొన్ని చిట్కాలు వాడుతోందట. అనుష్క తన బరువు తగ్గించడానికి వాడే చిట్కాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ చిట్కాలు ఏంటంటే..
కొబ్బరి నీళ్లను మధ్య మధ్యలో తీసుకుంటూ.. నీళ్లను ఎక్కువగా తాగాలట.
మరో చిట్కాలో.. ఎక్కువగా కూరగాయలను తీసుకోవడం. నాన్ వెజ్ ని వీలైనంతవరకు దూరం పెట్టి.. ఫైబర్ ఉండే కూరగాయలను ఎక్కువగా తినాలని చెప్పారు.
ప్రతీ రోజు మూడు పూటలు కాకుండా.. ఆ ఆహారాన్నే నాలుగైదు సార్లు కొద్ది కొద్దిగా తీసుకోవాలని చెప్పింది.
రాత్రి 8 గంటలలోపలే డిన్నర్‌ను పూర్తి చేస్తుందట అనుష్క. ఇది కూడా ట్రై చేయొచ్చు అంటోంది.
కచ్చితంగా ఇంటి ఆహారాన్నే తీసుకోవాలని చెప్పింది.
ఆహారంతో పాటు రెగ్యూలర్ గా యోగా, ఎక్సర్‌సైజులను క్రమం తప్పకుండా చేస్తుందట అనుష్క. ఈ చిట్కాలు మీరు ట్రై చేసినా.. తగ్గుతారని అంటోంది అనుష్క.



























