పెళ్ళి నిజమే కానీ, క్రికెటర్ తో కాదట… క్లారిటీ ఇచ్చిన అనుష్క !!

0
790

తాజాగా మాత్రం టీమ్ ఇండియా క్రికెటర్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తుందని, పెళ్ళి కూడా చేసుకోబోతుందని వస్తున్న వార్తలపై స్పందించింది అనుష్క. టాలీవుడ్, కోలీవుడ్ అంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా చెక్కు చెదరని అందంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు స్టార్ స్టేటస్ ని అనుభవిస్తోంది. బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర ఆమెకు దేశమంతా అభిమానులను సంపాదించుకుంది. “బాహుబలి” సినిమా తరువాత ఆమె స్టేటస్ మరింత పెరిగింది. ఈ పాత్ర చేసిన ఆ పాత్రలో పరకాయ ప్రేవేశం చేసే అనుష్క గతంలో కూడా “అరుంధతి”, “రుద్రమదేవి”, “బాగమతి” వంటి అద్భుమతమైన చిత్రాలతో సూపర్ హిట్ సినిమాలతో ఎందరో అభిమానుల మనసులు కొల్లగొట్టింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న అనుష్క ప్రస్తుతం “కోనా ఫిలిం కార్పొరేషన్ బ్యానర్” మీద కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న “నిశ్శబ్దం” అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుష్క తో పటు మాధవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తీ చేసుకునే పనిలో ఉంది.

అయితే స్వీటీ గురించి తాజాగా ఒక వార్త ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అదే అనుష్క పెళ్ళి. నిజమే నలభై పదుల వయస్సు కి చేరువవుతున్న ఈ ముద్దుగుమ్మ మీద రోజు ఎదో ఒక గాస్సిప్ వస్తుంటే ఉంటుంది. అయినా ఇటువంటి రూమర్స్ ఇదివరకే చాలా వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ – అనుష్క ల గురించి చాలా సార్లు వినిపించిన రూమర్. అయితే వీరిద్దరూ మేము పెళ్ళి చేసుకోవడం లేదు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చాలా సార్లు చెప్పారు. ఇది మాత్రమే కాదు స్వీటీకి మరికొందరు హీరోలతో కూడా పెళ్ళి చేసుకోబోతున్నారు అని రూమర్స్ వినిపించాయి.

అయితే ఇప్పుడు తాజాగా మాత్రం టీమ్ ఇండియా క్రికెటర్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తుందని, పెళ్ళి కూడా చేసుకోబోతుందని వస్తున్న వార్తలపై స్పందించింది స్వీటీ. త్వరలో పెళ్ళి చేసుకోవడం నిజమే కానీ, ఇండియన్ క్రికెటర్ తో కాదని తేల్చి చెప్పింది అనుష్క. ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దని ఆమె కోరారని సమాచారం. అయితే ప్రస్తుతం స్వీటీ “నిశ్శబ్దం” చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రం ఇదివరకు జనవరి 31న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసినా కొన్ని అనివార్య కారణాల దృశ్యా ఈ చిత్రాన్ని తాజాగా ఈ సంవత్సరం ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here