లాక్ డౌన్ దెబ్బకు మొత్తం వైన్స్ షాపులు అన్ని మూతపడ్డాయి. ఈ పరిణామంతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు మందు బాబులు. అయితే అటువంటి వారికోసం ఎపి ప్రభుతం మంచి టిప్స్ చెబుతున్నారు. ఇప్పటికే మద్యపాన నిషేధం కోసం చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ లాక్ డౌన్ సమయాన్ని మరింతగా వినిగించుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మద్యపాన గ్రస్తులకు ముఖ్య సూచనలు అంటూ మంచి దారిని చుపించింది ప్రభుత్వం. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో..

మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కాళ్ళూ, చేతులు వణకడం, రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నవారు తాము సూచించిన ఈ సూచనలు పాటించాలని సీఎం జగన్ చెప్పారు. నిద్రపట్టని వారు పిల్లలతో ఆదుకోవడం, టీవీ చూస్తూ కాలక్షేపం చేయాలనీ సూచించారు. తోట పని చేయడం, వ్యాయామం చేయడం, తరచూ నీళ్లు తాగుతుండటం, ప్రతి రోజు 8 నుండి 9 గంటలు నిద్రపోవడం వాల్ల చాలా మానసిక సమస్యలు దూరమవుతాయని చెప్పారు. కాగా మందు మానేయాలి అనుకునేవారికి ఈ లాక్ డౌన్ ఒక మంచి వరమని, మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడనికి లాక్ డౌన్ ను ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.






























