కరోనా ధాటికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను బ్రహ్మస్త్రంగా భావిస్తూ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమయంలో ఏపీ విధ్యుత్ శాఖ కెలక నిర్ణయం తీసుకుంది. తాజాగా గృహ, పారిశ్రామిక వినియోగదారులకు ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోయినా విధ్యుత్ సరఫరా నిలిపివేయకూడదని నిర్ణయించింది.

మామూలుగా బిల్లు జారీ చేసిన 14 రోజులకు బిల్లు చెల్లించాలి. ఒక వేళ పేమెంట్ కట్టడం కాస్త జాప్యం జరిగితే రేకనెక్షన్ చార్జెస్ వాసులు చేస్తారు. బిల్లు చెల్లించాల్సిన గడువు ముగిసిన వారం రోజులకు విధ్యుత్ సరఫరా నిలిపివేస్తారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ విధ్యుత్ శాఖ ఈ రూల్స్ ను సడిలిచింది. కరెంట్ బిల్లులు ఆలస్యంగా చెల్లించినా కూడా వినియోగదారులకు నుంచి జరిమానా వాసులు చేయకూడదని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సిఉందని ఓక అధికారి తెలిపారు.



























