త్వరలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయాతమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. అయితే శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితా సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల అధికారులతో చర్చలు జరపనున్నారు.

ఈ క్రమంలో క్రమబద్దీకరణ దిశగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న వార్తల జోరుగా వినిపిస్తున్న వేళ కాంట్రాక్ట్ ఉద్యోగులు కాస్త ఉద్వేగానికి లోనవుతున్నారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ నిర్ణయం భారీ ఉపశమనం ఇస్తుంది. అయితే సీనియార్టి ప్రకారం రెగ్యులరైజ్ చేస్తారా లేదా వేరే ఏమైనా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా అన్న విషయంపై స్పష్టమైన సమాచారం రావాల్సిఉంది.






























