ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీతో పలు ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యభివృద్ధి ని పెంపొందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా సాఫ్ట్ వేర్ రంగానికి సంబంధించిన యువతలో స్కిల్ డెవలప్ చేయడం కోసం ఏపీ శిక్షణా విద్యా శాఖ – మైక్రోసాఫ్ట్ సంస్థ ఇక మీదట కీలక భాగస్వాములు కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 1,62,000 వేల మంది యువతకు శిక్షణ నిచ్చి.. వారిని నిఫుణులుగా మార్చి ధృవపత్రాల అందజేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తెలియజేసింది.
జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కువగా విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే కలలుగన్న ప్రతి ఒక్కరు తమ కలను సహకారం చేసుకోవడానికి వీలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటి కార్యక్రమాలలో చేపట్టి విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వంటి కార్యక్రమాలను చేపడుతోంది



























