Ap politics: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి నామినేషన్ లో భాగంగా గురువారం పులివెందుల భారీ బహిరంగ సభలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే .ఈ బహిరంగ సభలో భాగంగా ఈయన అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ వైయస్ షర్మిలపై అలాగే ఇతర ప్రత్యర్థుల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా తన ఇద్దరు చెల్లెలు వివేకానంద రెడ్డి హత్య కేసును అడ్డుపెట్టుకొని పులివెందులలో రాజకీయాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తన బాబాయ్ హత్యను తమ రాజకీయాల కోసం షర్మిల సునీత వాడుకుంటున్నారని వైఎస్ అవినాష్ రెడ్డిని దెబ్బతీయాలని ఇలాంటి పథకం పన్నారంటూ జగన్ విమర్శలు చేశారు.
వివేకా బాబాయ్ హత్య కేసు గురించి తన చెల్లెలు మాట్లాడుతున్నటువంటి మాటలపై జగన్ స్పందించారు. వైయస్ అవినాష్ రెడ్డి ఈ హత్య చేశారని అందరూ భావిస్తున్నారు. అయితే బాబాయిని ఎవరు హత్య చేశారనే విషయం దేవుడికి తెలుసు బాబాయికి తెలుసు చంపిన వారికి తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
ఎలాంటి తప్పు చేయనటువంటి అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికిస్తున్నారని పాపం అవినాష్ రెడ్డి చాలా చిన్న పిల్లవాడు మా అందరికన్నా కూడా చిన్న పిల్లోడని తన జీవితాన్ని నాశనం చేయడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జగన్ విమర్శలు చేశారు. అంతేకాకుండా వివేకానంద రెడ్డికి రెండో పెళ్లి జరిగిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వారికి మరొక సంతానం కూడా ఉన్నారని అందరికీ తెలిసిన సత్యం అంటూ ఈ సందర్భంగా జగన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.





























