బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణ వివాదంపై పోలీసుల దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ లో నెపోటిజం, చీకటి కోణాలకి సంబంధించిన పలు అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెపోటిజం, బాలీవుడ్ మాఫియా వల్ల ఇబ్బందులు పడిన ఒక్కొక్క సినీ సెలబ్రిటీ ఈమధ్య మీడియా ముందుకొచ్చి తమ మనోవేదనను చెప్పుకుంటున్నారు.

కొందరైతే సోషల్ మీడియాలో ట్వీట్ల ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ పై ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ కూడా సంచలన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లోని కొందరు బడా బాబులు తనను కావాలనే సైడ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లేటెస్ట్ గా ఓ రేడియో ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “బాలీవుడ్ సినిమా ఛాన్స్ లు నా వరకు రానివ్వకుండా కొందరు బాలీవుడ్ బడా బాబులు కుట్ర చేస్తున్నారు. నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ నాపై లేనిపోని రూమర్స్ ను క్రియేట్ చేస్తూ.. సినిమా షూటింగ్ అనుకున్న టైంకి స్వరాలు ఇవ్వననే దుష్ప్రచారాన్ని చేస్తుంది. నేను దైవాన్ని నమ్ముతాను, నా వరకు వచ్చిన సినిమాలకు న్యాయం చేస్తాను.” అంటూ AR రెహమాన్ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సుశాంత్ ఆఖరి చిత్రం ‘దిల్ బేచారా’ దర్శకుడు ముఖేష్ చబ్రా మాట్లాడుతూ.. AR రెహమాన్ కి ‘దిల్ బేచారా’ చిత్రంలో ఛాన్స్ ఇవ్వవద్దని తనకు కొందరు బాలీవుడ్ ప్రముఖులు చెప్పారని తెలియజేశారు. అయితే ఫైనల్ గా ‘దిల్ బేచారా’ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ కూడా బాలీవుడ్ లోని నెపోటిజంపై కామెంట్లు చేయడంతో బాలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోషల్ మీడియాలో AR రెహమాన్ కామెంట్స్ వైరలవుతున్నాయి.




























