Archana : అర్చన గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి వేద తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం సినిమాలలో నటించింది. అర్చన మంచి డాన్సర్, తనతల్లి విజయశాస్త్రి కూడా నాట్యకారిణి కావడంతో రెండేళ్ల వయసునుండే అర్చన కు నాట్యంలో ప్రవేశముంది. ఇక సినిమాలపై ఇంట్రస్ట్ తో సినిమా రంగలోకి అడుగుపెట్టిన అర్చన మొదటి సినిమా ‘తపన’ కానీ అల్లరి నరేష్ నటించిన ‘నేను’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కన్నడలోనూ ‘ఆ దినగలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళం, మలయాళం వంటి భాషలలో కూడా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

రాజమౌళి సినిమాలో అవకాశాలు ఎలా పోయాయంటే…
ఇక అర్చన కు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో లలిత పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ సినిమాతో మిగిలిన భాషలలో కూడా మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలోనే రాజమౌళి మగధీర సినిమాలో ఒక పాత్రకు అడుగగా వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేదు. ఇక ఆ తరువాత యమదొంగ సినిమాలో ఒక పాటలో నర్తించిన అర్చన, ఆ తరువాత మళ్ళీ రాజమౌళి మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్ పాత్రకు అడుగగా, అప్పుడు అవకాశాన్ని వేరే సినిమాల బిజీ వల్ల వదులుకుందట. ఒక వేళ ఆ పాత్రలు చేసుంటే కెరీర్ బాగుండేదేమో అని అర్చన బాధపడ్డారు.

ఇక అలీ తో సరదాగా షోలో పాల్గొన్న అర్చన భర్త జగదీశ్ భక్తవత్సలం, వారి దంపత్య జీవితం గురించి ముచ్చటించారు. ఇక పెళ్ళైన వెంటనే హాస్పిటల్ ఎందుకు వెళ్లారని ఆలీ అడుగగా, జగదీష్ మాట్లాడుతూ మందు తాగేసింది, తన కెపాసిటీ తెలియక నేను చూస్తుండి పోయా, ఆ తరువాత హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది అంటూ సరదా విషయాలను పంచుకున్నారు. ఇక పెద్ద సినిమాలో అవకాశం వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయా అని అడగగా అర్చన కంట తడి పెట్టింది. ఇక అక్కడితో ప్రోమో ఎండ్ చేసారు అసలు అర్చన ఎందుకు ఏడ్చిందనే విషయం ఎపిసోడ్ వచ్చాకే తెలుస్తుంది.



























