మీరు తల్లి కాబోతున్నారా ?? అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి…

0
855
  1. స్త్రీలు గర్భము ధరించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన శిశువుకు తల్లి అయ్యే అవకాశాలు బాగా పెరుగుతాయి. గర్భం ధరించడం అనేది స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, అంగవైకల్యం లేకుండా పుట్టాలని కోరుకుంటారు. పైగా గర్భవతి తొమ్మిది నెలలు క్షేమదాయకంగా గడిచి సుఖప్రసవం కావాలని ఆశిస్తుంది. గర్భవతి ఆరోగ్యం గర్భం ధరించే ముందు వుండే ఆరోగ్యంపై ఆధారపడి ఉండుంది.అందుకే గర్భం ధరించే ముందు స్త్రీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..

2. ఏ ఏ పరిస్థితులు గర్భం మీద దుష్ప్రభావాలు చూపుతాయో గుర్తించి ఆ పరిస్థితులు లేకుండా చేసుకోవాలి. గర్భం ధరించాలనుకున్న స్త్రీ తగిన పౌష్టికాహారం భుజిస్తూ శరీర ఆరోగ్యం బాగా ఉండేటట్లు చూసుకోవాలి. గర్భం ధరించగానే శరీరపు అనేక అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. అందుకే గర్భం ధరించాలనుకున్న స్త్రీలకు ప్రోటీన్లు, ఐరన్,కాల్షియం, విటమిన్ లోపం ఉండకూడదు. ఏది లోపం ఉన్నా వెంటనే ఆ లోపాన్ని సరిచేసుకోవాలి.

3. ఆర్ధిక పరిస్థితి :- గర్భం ధరించే ముందు తమ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి. ఎందుకంటే గర్భం ధరించిన సమయంలోనూ, ప్రసవానంతరం శిశువును పెంచేందుకు ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా స్త్రీ తయారుగా ఉండాలి. గర్భం ధరించడం, ప్రసవం, శిశువును పెంచడం వంటి పనులకు శారీరక శ్రమ మాత్రమే కాక, మానసిక అలసట కూడా ఉండుంది. అందుకే స్త్రీ మానసికంగా ఈ శ్రమలను తట్టుకునేందుకు ఇష్టపడాలి. అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధులతో స్త్రీ బాధపడుతూ ఉండకూడదు.
ఎయిడ్స్,హైపటైటిస్, రూబెల్ల, మలేరియా, సిఫిలీస్ వంటి వ్యాధులతో ఉండకూడదు. ఈ వ్యాధులు సులువుగా గర్భస్థ శిశువుకు సోకుతాయి. పైగా గర్భస్థ శిశువుకు ఈ వ్యాధుల వల్ల మానసిక, శారీరక అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంటుంది.

4. దురలవాట్లకు దూరంగా ఉండాలి :- మద్యం సేవించడం, ధూమపానం చేయడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వదిలివేయాలి. అధికంగా కాఫీ సేవించే అలవాటు కూడా మానుకోవాలి. పొగాకు, మత్తు పదార్ధాలను వాడడం అలవాటు ఉంటే ఆ పద్ధతులు విడనాడాలి. ముఖ్యంగా గర్భం ధరించే ముందు గర్భవతిగా ఉన్న సమయంలో దూరలవాట్లకు దూరంగావుండాలి.

మదుమేహవ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా గర్భం ధరించే ముందు రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంచుకోవాలి. అవసరమైతే వైద్య సలహా అనుసరించి గర్భవతిగా ఉన్న సమయంలో కూడా షుగర్ అదుపులో ఉండేందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇప్పించుకోవాలి. రక్తంలో గ్లోకోజ్ స్థాయి అధికంగా ఉంటే గర్భం రాకుండా వుండే పరిస్థితి ఎదురుకావచ్చు లేదా గర్భంపై ప్రతికూల ప్రభావం కల్గించవచ్చు. అధిక రక్తపోటుగలా స్త్రీలు వైద్య సలహాలు తీసుకొని రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు మందులు వాడటం మంచింది. వారసత్వంగా వచ్చే రోగాలు, జన్యుపరమైన సమస్యలు తల్లిదండ్రులలో వుండే లేదా సమీప బంధువులకు ఉంటే లేదా అంతకుముందు గర్భవతి అయినపుడు ఎదురయితే వీలైనంత వరకు గర్భం ధరించాలనుకునే వాళ్ళు జెనెటిక్ కౌన్సెలింగ్ కి వెళితే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here