కేవలం ఒకే ఒక్క సినిమా కొందరి జాతకాలను అమాంతం మార్చేస్తుంది. అది నిజమని నిరూపిస్తూ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే అదే సినిమాలో ఆయన సరసన నటించిన హీరోయిన్ శాలిని పాండే కు మాత్రం ఆశించినంత గుర్తింపు రాలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఆ తరువాత సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైంది శాలిని పాండే.

తరువాత కళ్యాణ్ రామ్ 118 చిత్రంలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో పెద్దగా పేరు రాలేదు. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్న ఆమె తాజగా అనుష్క నటించిన “నిశ్శబ్దం” సినిమాలో ప్రముఖ పాత్ర పోషితోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా విడుదలకు నోచులేదు. అయితే తాజాగా ఈ అమ్మడుకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ తెగ వైరల్ అవుతుంది. గోవాలో ఒక బాత్ టబ్ లో స్విమ్ సూట్ వేసుకుని రిలాక్స్ అవుతూ మద్యం తాగుతున్నట్టుగా ఉన్న ఆమె ఫోటో ఒకటి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది షాలిని.

ప్రస్తుతం ఈ ఫోటోను నెటిజన్లు భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఫోటోలు పెడతావా? అసలు నీకు బుర్ర పని చేస్తుందా అంటూ శాలిని పండేపై మండిపడుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు.. మరి మున్ముందు ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here