Arjun Tendulkar: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రికెటర్ గా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. 2021 నుంచి ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్న అర్జున్ టెండూల్కర్‌కు ఈ సీజన్‌లో ఆడే అవకాశం దక్కింది.

ముంబై జట్టులో బౌలర్ గా అర్జున్‌కు వరుస అవకాశాల వస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను అర్జున్ కూడా అద్భుతంగా వినియోగించుకుంటు తన బౌలింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా అర్జున్ టెండూల్కర్ చేసిన ఒక చిలిపి పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సచిన్ టెండూల్కర్ కొడుకు కావడంతో అతని ఆట మీదే కాకుండా ప్రతి కదలిక మీద ఫోకస్ ఉంటుంది.
ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జున్ టెండూల్కర్ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా మంగళవారం మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయినా.. అర్జున్ బౌలింగ్‌తో తన ఆకట్టుకున్నాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒక వికెట్ కూడా తీశాడు.

Arjun Tendulkar: చిన్నపిల్లడి చేష్టలు పోలేదా…
అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ పరంగా ఆడియన్స్ అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే మ్యాచ్ మధ్యలో ముక్కులో పొక్కు తీసుకున్న అర్జున్ ఆ వేలిని మళ్లీ వెంటనే నోట్లో పెట్టుకున్నాడు. దీంతో ముక్కులో వేలు పెట్టుకుని మళ్లీ అలా ఎలా నోట్లో పెట్టుకున్నాడు అంటూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. దీంతో అర్జున్ కి ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు పోలేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అర్జున్ టెండూల్కర్ కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
— dc (@kaunHuMei) April 26, 2023































