Artist Dr N. Vijayalakshmi : ఆమె వయసు డెబ్భైఒక్క సంవత్సరాలు కానీ ఆమె చలాకి తనానికి ఆ వయసు అడ్డురాలేదు. డెబ్భై ఏళ్ల వయసులో నటి అయింది. అది కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్, పుష్ప 2, ఆచార్య వంటి సినిమాల్లో నటించిన ఆమె ఆమె జీవితపు విశేషాలను పంచుకున్నారు.

పిల్లలు కొట్టారు… నా జీవితాశయం అదే…
కర్నూల్ కు చెందిన విజయలక్ష్మి గారికి చిన్నత్తనంలోనే తండ్రి దూరమవగా తన తోబుట్టువుల బాధ్యత తానే తీసుకున్నారు. తాను పదో తరగతి వచ్చేసరికి ఇంటి బాధ్యతలను తీసుకుని అందరినీ చదివించి సెటిల్ చేసారు. అయితే తాను మాత్రం పెళ్లి చేసుకోకుండా అలానే ఒంటరిగా ఉండిపోయారు. కూచిపూడి కళాకారిని అయినా విజయలక్ష్మి గారు ముప్పైవ ఏట అందరి బాధ్యతలను తీర్చుకున్నాక తన నాట్యప్రదర్శన మీద ద్రుష్టి పెట్టి ఆ దిశగా అడుగులు వేశారు. ఇక స్వతహాగా న్యాయవాది అయిన ఆమె సామజిక వేత్త కూడా ఇక 2015 సమయంలో ఒక షార్ట్ ఫిల్మ్ కోసం కొందరు ఆమెను నటించమని అడగడం ద్వారా నటి అయిన ఆమె శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోళ సినిమాలో నటించారు. అలా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె శ్రీవిష్ణు గారి సినిమాల్లోనే మూడు సినిమాలను చేసారు.

ఇక పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన ఆమె 65 ఏళ్ల వయసులో ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని తన మేనమామ సలహా మేరకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన ఆస్తి పిల్లలకు రాకుండా నాకెక్కడ ఇస్తారో అని ఆయన పిల్లలు మనవళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, కొట్టేవారు అంటూ విజయ లక్ష్మి తెలిపారు. దీంతో ఆ బంధం వద్దని బయటికి వచ్చేసాను. ఇక తాను పెంచి పెద్ద చేసిన తమ్ముడు చెల్లెళ్ళకు తాను బరువు కాకపోయినా వారికి ఆ ఇబ్బంది ఉండకూడదనే తన శరీరాన్ని మెడికల్ కాలేజీ కి దానం చేశారట విజయలక్ష్మి గారు. అది కూడా 1999 ఆ ప్రాంతంలోనే ఆ నిర్ణయం తీసుకుని హాస్పిటల్ కి రాసేశారట. ప్రస్తుతం పుష్ప 2, సలార్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు విజయలక్ష్మి. ఆమె జీవితాన్ని పదేళ్లు చొప్పున పది అధ్యాయాలుగా పుస్తకం రాయాలనేది ఆమె జీవిత ఆశయంగా ఆమె చెప్తారు.