Artist Mirchi Madhavi : మూవీ ఆఫర్స్ తగ్గిపోడానికి కారణం అదే… నాకు అలాంటి లైఫ్ వద్దు…: నటి మిర్చి మాధవి

0
123

Artist Mirchi Madhavi : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపుతో దూసుకుపోతున్న నటి ఊట్ల మాధవి. కానీ మిర్చి మాధవి గా సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట రేడియో జాకీగా తన కెరీర్ మొదలు పెట్టిన మాధవి ఆ తరువాత ఆర్టిస్ట్ గా సినిమాల్లో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చాలా సినిమాల్లో అత్త, వదిన, తల్లి పాత్రలతో మెప్పించిన మాధవి ఎన్టీఆర్ కథనాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇక సినిమాలే కాకుండా సీరియల్ ఆర్టిస్ట్ గా ఉన్న మిర్చి మాధవి మా టీవిలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ లో నటించి దేవయాని పాత్రలో ప్రేక్షకులకు స్థిరపడిపోయారు.

అవకాశాలు లేకపోవడానికి కారణం అదే…

తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ మిర్చి మాధవి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. సినిమాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళకే ఎక్కువ అవకాశాలు రావడం పట్ల మాట్లాడుతూ ఇక్కడ ఉన్నవారికి అవకాశం ఇస్తే బాగుంటుందని, బయటి వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు కానీ ఇక్కడున్న వారికి నిలబడటానికి కూడా అవకాశం లేకుండా బయటి వాళ్లను తెచ్చిపెట్టుకోవడం ఎందుకు అంటూ అభిప్రాయపడ్డారు.

ఇక తన భర్త యూకె లో ఉద్యోగం చేస్తూ అక్కడికి వెళ్ళవలసి రావడం వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చానని చెప్పారు. ఇక అందువల్లే సినిమాల్లో కనిపించడం లేదని మళ్ళీ ఇపుడు నటించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. గుప్పెడంత మనసు సీరియల్ ను వదులుకొని వెళ్లడం పెద్ద పొరపాటు అంటూ చాలా మంది ఇప్ప్పటికీ దేవయాని పాత్రలో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారని అడుగుతుంటారు అంటూ చెప్పారు. ఇక యూకె లో ఉండలేక పోయానని, అక్కడ ఒంటరిగా ఉండటం నన్ను బాగా బాధించిందని, అలాంటి లైఫ్ లో నేను ఉండలేనని అనిపించింది అంటూ చెప్పారు. అందుకే ఇప్పటికీ యూకె లో మేమున్న ప్లేస్ పేరు వింటేనే ఒకలాంటి భయం వస్తుందని ఇక అక్కడి నుండి వచ్చి మళ్ళీ నటనలో బిజీ అవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు.