Artist Prabhavathi : ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ప్రభావతి గారు ఆ తరువాత సినిమాల్లో అమ్మగా, అత్తగా, అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. సుమారు 150 సినిమాలను చేసిన ఆమె పలు సీరియల్స్ లో కూడా నటించారు. అయితే తాజాగా ఆమె ‘బేబీ’ సినిమాలో హీరోకి తల్లిగా మూగ పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ విశేషాలను పంచుకున్నారు.

ఆ సినిమా కోసం బాగా దెబ్బలు తిన్నా…
నటులన్నాక సినిమా సమయంలో ఏదో ఒక ప్రమాదనికి అనుకోకుండానో తెలిసే రిస్క్ చేయడమో చేస్తుంటారు. అలా ప్రభావతి గారు కూడా రవి బాబు డైరెక్షన్ లో వచ్చిన ‘అమరావతి’ సినిమా టైంలో రెండు మోకాళ్లకు దెబ్బలు తగిలించుకున్నారట. ఆ సినిమాలో హీరో హీరోయిన్ చిన్నప్పటి సీన్స్ లో కనిపించే ప్రభావతి గారు బ్రిడ్జి మీద కంకర రాళ్ళలో చెప్పులు లేకుండా పరిగెత్తే సీన్ చేయడం వల్ల కాళ్లకు అలాగే పడటంతో మోకాళ్ళకు గాయాలు అయ్యాయట.

ఇక మరో సీన్ లో జీప్ గుద్ది వెళ్లే సీన్ లో కూడా పడటంతో బాగా గాయాలయ్యాయంటూ చెప్పారు. ఇక పెద్ద హీరోల సినిమాల్లో కాంబినేషన్ సీన్స్ చెప్పినపుడు స్టార్ హీరోలతో సీన్స్ అంటే భయమేసేది. రవితేజ, బాలకృష్ణ, శ్రీకాంత్ ఇలా ముందే సీన్ చెప్పేటప్పుడు పలానా వాళ్లతో సీన్ అన్నపుడు కాస్త బెరుకుగా ఉంటుంది. కానీ షూటింగ్ లో సీన్ చేసేటపుడు మాత్రం ఎటువంటి భయం లేకుండా చేస్తాను అంటూ చెప్పారు.