Artist Pramila Rani : ఒక డైరెక్టర్ గెస్ట్ హౌస్ కి రమ్మన్నాడు… పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అంటే…: నటి ప్రమీల రాణి

0
195

Artist Pramila Rani : దాదాపు 85 కు పైగా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మంచి పేరు, గుర్తింపు అందుకున్న నటి ప్రమీల గారు. బాహుబలి బామ్మగా మంచి గుర్తింపు అందుకున్న ప్రమీల గారు మొదట వద్దు బావ తప్పు, రియల్ పోలీస్, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్టు గోదావరి మొగుడు, వేదం, బాహుబలి, విక్రమార్కుడు, చలో ఇలా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎక్కువగా వేదం, బాహుబలి సినిమాల్లో గుర్తింపు అందుకున్న ఆమె తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు.

క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు నేనూ పడ్డాను…

ప్రమీల గారు ఒక బాబును తీసికుని హైదరాబాద్ వచ్చి అవకాశాలను వెతుక్కున్నారు. అయితే ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు చెప్పినట్లుగానే ఆమె కూడా క్యాస్టింగ్ కౌచ్ వల్ల అవకాశలను కోల్పోయారట. రాధిక గారి ‘చిందు’ అనే సినిమాలో ఒక క్యారెక్టర్ కి సెలెక్ట్ అవ్వగానే ఇంకో మూడు రోజుల్లో షూటింగ్ అనగా మేనేజర్ ఫోన్ చేసి డైరెక్టర్ మిమ్మల్ని కలవాలని అంటున్నారు ఒక సారి గెస్ట్ హౌస్ కి రండి అని చెబితే నేను రాను మూడు రోజుల్లో షూటింగ్ పెట్టుకుని ఎందుకు పిలుస్తారు అని ఫోన్ పెట్టేసారట. ఇక ఆ సినిమాలో ఆఫర్ పాయిందట ప్రమీల గారికి. అలా రెండు మూడు ఆఫర్స్ చేజారాయని మనకు వచ్చిందే మన ప్రాప్తం అనుకుంటా అంటూ ప్రమీల తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో నటించినపుడు ఆయన్ను దగ్గరగా చూసే అవకాశం కలిగిందని, ఆయన చాలా మంచివాడు అంటూ చెప్పారు. ఆయన నేను సీన్ డైలాగ్ చెప్పగానే చాలా బాగా చెప్పారండి అంటూ మాట్లాడారు. నేను వెంటనే చెప్పకపోతే మీరు సినిమాలో తీసుకోరు కదా బాబు అని చెప్పాను. అడిగిన వెంటనే ఫోటో కూడా దిగారు నాతో అంటూ చెప్పారు.