Arul Saravanan : చెన్నై వ్యాపారావేత్త శరవణ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్. వేల కోట్ల వ్యాపారం చేస్తున్న శరవణన్ తన షాపింగ్ మాల్ కి సంబంధించిన దసరా దీపావళి సమయంలో తీసే కమర్షియల్ యాడ్స్ లో కనిపించి అల్లరిస్తుంటాడు. ఆ యాడ్స్ కోసం బాగా ఖర్చు పెడుతుంటారు శరవణన్. తాను మాత్రమే కనిపిస్తే యాడ్ ఎవరు చూస్తారు అనుకుంటారేమో కనీసం ఇద్దరు హీరోయిన్లలను పెట్టుకుని యాడ్ చేస్తారు. ఒక్కోసారి నలుగురు, ఐదుగురు హీరోయిన్స్ ఉంటారు. అలా యాడ్స్ ద్వారా పాపులర్ అయిన శరవణన్ ఇపుడు ఏకంగా సినిమా తీసాడు.

80 కోట్లు పెట్టి ది లెజెండ్ శరవణన్…
ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ‘ది లెజెండ్ శరవణన్’ అనే సినిమాను తీశారు శరవణన్. ఇంత ఖర్చుపెట్టి ఒకసినిమా తీయాల్సిన అవసరం ఏంటి అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక నెటిజన్స్ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఒక పాన్ ఇండియా లెవెల్లో అంత ఖర్చు పెట్టి సినిమా తీసి తగలెయడం వెనుక ఏం లాజిక్ ఉంది అంటూ ఆలోచిస్తున్నారు. అయితే దీని వెనుక శరవణన్ పెద్ద ప్లాన్ ఉందంటూ అంటున్నారు. శరవణన్ ముందు వ్యాపార వేత్త, ఆ తరువాత సినిమా ఆలోచన చేసారు. అందుకే ఆయన వ్యాపారవేత్త గానే మొదట ఆలోచిస్తాడు. సినిమా పోయి 80 కోట్ల నష్టం వస్తే ఇంకేం వ్యాపార వేత్త అంటారా.. దానికి ఒక లాజిక్ ఉంది.

శరవణ స్టోర్స్ ఇప్పటివరకు సౌత్ కి పరిమితం అందులోనూ చెన్నై లో ఎక్కువ కానీ ఉత్తరాది లోనూ ప్రాచూర్యం పొందాలంటే శరవణన్ మొదట ఫేమస్ అయితే పాన్ ఇండియా లెవెల్లో బిజినెస్ కి ప్లస్ అవుతుందనేది శరవణన్ ప్లాన్. అందుకే ఎనభై కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా తీశారు. ఇక యాడ్స్ కోసం సెలబ్రిటీలకోసం వెతికే పని లేదు, సినిమాల ద్వారా ప్రమోట్ అయితే తన స్టోర్స్ కి యాడ్స్ తానే చేసుకోవచ్చు. దీనివల్ల కోట్ల రుపాయాలు ఆదా అవుతాయి. మరీ ముఖ్యంగా ఒక రెండు సినిమాలు తీస్తే జనాలు కూడా ఆయనను హీరోగా అంగీకరిస్తారనేది ఆయన ఆలోచన అయ్యుండొచ్చు. ఇలా కోట్లలో ముందస్తు బిజినెస్ ఆలోచనల్తో శరవణన్ సినిమా తీశారు. ఈ లాజిక్ తెలియని చాలా మంది ఆయనను ట్రోల్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు.



























