భార్య కోసం నిర్మాత గా మారిన మరో హీరో.. రిస్క్ చేస్తున్నాడా..?

0
157

పెళ్లి చేసుకున్న భార్య కోసం ఆస్తులు రాసివ్వాలి, బంగారం కొనివ్వాలి లేదంటే షాపింగ్ తీసుకెళ్లాలి అని అనుకునే భర్తలున్న ఈరోజుల్లో ఈ స్టార్ లు మాత్రం వారి భార్యల కోరిక మేరకు నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలు భాగస్వామి కోరిక మేరకు సినిమాలు నిర్మించడం మొదలుపెడుతున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు ఇప్పటికే ఈ ట్రెండ్ కి స్వాగతం పలికాడు.. మరికొంతమంది కూడా భార్యల కోరిక మేరకు నిర్మాతలుగా మారే ఆలోచనలు చేస్తున్నారు.

ఇక కోలీవుడ్ లో ఈ తరహా పద్ధతి ఎక్కువయిపోయింది. ఇప్పటికే జ్యోతిక చెప్పిందని సూర్య సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తన పిల్లల పేర్ల మీద బ్యానర్ ను స్థాపించి, తన భార్య ప్రధాన పాత్రలో సినిమాలు నిర్మించడం ఆయనకు మాత్రమే చెల్లింది. సినిమాలు నిర్మించడమే కాకుండా ఆమెపై వచ్చే ట్రోల్ల్స్ కి అడ్డుగా నిలిచి ఉత్తమ భర్త అనిపించుకున్నాడు.

తాజగా ఆర్య కూడా ఇదే బాటలో తన భార్య కోరిక ను నెరవేర్చే పనిలో ఉన్నాడు. రెండేళ్ళ క్రితం బాలీవుడ్ భామ సాయేషాను పెళ్లాడిన ఆర్య, ఇప్పుడు ఆమె హీరోయిన్ గా రూపొందే సినిమాలు నిర్మించడం కోసం ఒక హోమ్ బ్యానర్ ను మొదలెట్టే పనిలోపడ్డాడు.ఇటీవల ఓ యువ దర్శకుడు చెప్పిన కథను మెచ్చిన సాయేషా నటించడానికి ఒకే చెప్పిందట. బయట బ్యానర్ లో చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలిసిన ఆర్య ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మరి భర్త తో చేసే పని తో సయేశా హిట్ కొడుతుందా చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here