Ashish Vidyarthi: భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఆశిష్ విద్యార్థి… అలా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్!

0
66

Ashish Vidyarthi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఆశిష్ విద్యార్థి ఒకరు. ఇలా పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన గత కొద్దిరోజుల క్రితం రూపాలి అనే ఫ్యాషన్ ఎంటర్ ప్రేన్యూయర్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా 57 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆశిష్ విద్యార్థి 33 సంవత్సరాలు కలిగినటువంటి యువతిని రెండవ వివాహం చేసుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. దీంతో చాలా మంది నేటిజన్స్ లేటు వయసులో ఘాటు ప్రేమలు ఏంటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు.

అయితే ఈ విమర్శలపై స్పందించినటువంటి ఈయన పెళ్లి అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కాదని ఒక వ్యక్తికి జీవితాంతం ఒక తోడు అంటూ విమర్శలను తెప్పి కొట్టారు.అయితే ఇలా లేటు వయసులో పెళ్లి చేసుకున్నటువంటి ఆశిష్ విద్యార్థి తాజాగా హనీమూన్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఇలా ఈ జంట హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Ashish Vidyarthi:హనీమూన్ ట్రిప్ లో ఆశిష్ దంపతులు..’


వీరి హనీమూన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నేటిజన్స్ ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే కాబోలు అంటూ పెద్ద ఎత్తున వీరి పై ట్రోల్ చేస్తున్నారు. అలాగే పలువురు వీరికి మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.