Ashu reddy : సమంత డూప్ లా ఉండే అషురెడ్డి డబ్ స్మాష్, టిక్ టాక్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అడపా దడప మా టీవిలో ప్రోగ్రామ్స్ లో కనిపించిన అషు మళ్ళీ ఇపుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి వచ్చింది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఇపుడు ఇక క్లైమాక్స్ కి వచ్చేసింది. పెద్దగా ప్రేక్షకాదరణలేని బిగ్ బాస్ నాన్ స్టాప్ ఇక చివర దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ ముందు సీజన్స్ పార్టిసిపెంట్స్ వచ్చి సందడి చేసారు.

ఇక సన్నీ, షణ్ముఖ్, రవి హౌస్ లోకి వచ్చి రచ్చ చేసారు. ఇక ఫ్యామిలీ ఎపిసోడ్ తో ఫుల్ ఎమోషనల్ అయిన బిగ్ బాస్ హౌస్ ఇక ముందు సీజన్స్ కంటెస్టెంట్స్ తో జోష్ వచ్చింది. ఇక ఎలిమినేషన్ లో అషు హౌస్ నుండి బయటికి వచ్చింది. ఇక మా టీవీ లో ప్రసారమయ్యే బిగ్ బజ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను ఇంటర్వ్యూ చేస్తారు. ఇక యాంకర్ రవి అషు రెడ్డిని బజ్ ఇంటర్వ్యూ చేసాడు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు బిగ్ బాస్ టీం.
ఇంటర్వ్యూలో లేచి వెళ్లిపోయిన అషు….

యాంకర్ రవి అషుని ఇంటర్వ్యూ కి ఆహ్వానిస్తూ ఎలిమినేట్ అయినందుకు బాధగా ఉన్నా, నీకు కంగ్రాట్స్ చెప్పాలని ఉంది అన్నాడు. దానికి అషు ఎందుకని ప్రశ్నించగా, ఎప్పుడో బయటకు రావాల్సిన నువ్వు ఇప్పుడోచ్చావ్, గుడ్ జర్నీ అని ఆటపట్టించాడు. ఆ తర్వాత ‘నీ గేమ్ లో వరస్ట్ కెప్టెన్, వరస్ట్ హౌస్ మేట్, వరస్ట్ సంచాలక్, వరస్ట్ బిహెవీయర్ అన్ని వరస్టూ అలా నీకే వచ్చింది’ అని రవి అనగా… దీనికి ఆమె మనమే కాదు మనకంటే వెధవలు ఉన్నారు అని అషు కౌంటర్ వేసింది.. దీంతో నిన్ను నువ్వు వెధవ అనుకోవడం. నాకా అర్హత లేదు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ రవి అడిగాడు . కొంతమందిని నామినేట్ చేయాలంటే అషు భయపడిందా? హౌస్‌లో ఒక్కరిదగ్గర అవసరానికి మించి అలిగావు వారి మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్టా? అని ప్రశ్నించాడు రవి. ఇక బయట అలుగుడు స్టార్ అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అయిందంటూ సటైర్ వేశారు. హోస్ లో ఒక సంఘటన తరువాత బాగా లో అయ్యావ్…ఆ విషయం గురించి అడగొచ్చా అంటే అషు స్కిప్ చేయమనగా రవి నువ్వు స్కిప్ చేయమన్న ప్రేక్షకులు ఆ ఇష్యూ కి సంబంధించి నీ నుండి సమాధానం కోరుకుంటున్నారు అని అనగానే అషు రెడ్డి లేచి వెళ్లిపోవడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. మరీ అసలు ఏమి జరిగిందో తెలియాలంటే బిగ్ బాస్ బజ్ పూర్తి ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సిందే.































