Ashu Reddy: డబ్ స్మాష్ వీడియో లతో పాపులర్ అయిన అషురెడ్డి సమంత డూప్ గా మంచి పేరు సంపాదించుకుంది. బిగ్ బాస్ – 3 లో పాల్గొని మంచి ఇమేజ్ తెచ్చుకుంది. తరువాత టీవీ ప్రోగ్రామ్స్ లో ఛాన్స్ లు కొట్టేసి బిజీ గా గడుపుతోంది. తాజాగా ఒక సినిమాలో కూడా నటించింది. ఇక సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోలతో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఓ టీ టీ లో కంటెస్టెంట్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఓ టీ టీ లో కంటెస్టెంట్లుగా చాలామంది ఎన్నికైనా అందులో అషు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అషు రెడ్డి షో చివరి వరకు కొనసాగుతుంది అని అందరు అనుకున్నారు కాకపోతే అభిమానులను షాక్ కి గురి చేస్తూ గత ఆదివారం అషుని షో నుంచి ఎలిమినేట్ చేశారు.

అయితే ఎలిమినేట్ అయిన అషు నాగార్జున హోస్ట్ చేస్తున్న స్టేజ్ మీదకి వచ్చిన తరువాత, బిగ్ బాస్ అషు బిగ్ బాస్ జర్నీ వీడియో ని ప్లే చేశారు. అయితే అందులో అషు నాగార్జున ని కిస్ చేస్తున్న విజువల్ చూపించిగానే అషు మరోసారి స్టేజ్ మీద వున్న నాగార్జునకు ముద్దు పెట్టింది. అయితే తాజాగా నాగార్జునకు ముద్దు పెట్టిన ఆ ఫోటోని అషు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
స్టేజ్ మీద నాగార్జునకి ముద్దు పెడుతున్న ఫోటో షేర్ చేస్తూ…..
అషు నాగార్జున తో ఫోటో ని పోస్ట్ చేస్తూ….”ఈ ఇంటిలో లిటిల్ గాళ్ ను నేను మిస్ అవుతానని నాగార్జున గారు నాతో చెప్పారు. బిగ్ బాస్ ప్రపంచంలో ఆయన ఎప్పుడూ అందరితో మంచిగా ఉంటారు. అందరికి మోటివేషన్ ఇస్తారు. అందరినీ గౌరవిస్తూ మంచి హోస్ట్ గా ఉన్నందుకు థాంక్స్. నా హృదయంలో మీది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే అంటూ అషురెడ్డి రాసుకొచ్చింది. తాజాగా నాగార్జునకు ముద్దు పెడుతూ ఉన్న ఫోటో తో పాటు పెట్టిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.



























