Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో అషు రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.ఈమె టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఎంతో పాపులారీటీ సంపాదించుకున్నారు.ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కాస్త సమంత పోలికలతో ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సమంతగా పాపులర్ చేశారు.

ఈ క్రమంలోనే ఇదే అవకాశంగా భావించిన అషు రెడ్డి రోజురోజుకు విపరీతమైన సాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇదే పాపులారిటీతో ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుంది. మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ సమయంలోనే వెనతిరిగి వచ్చింది. బిగ్ బాస్ తర్వాత సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

ఇకపోతే తాజాగా మరోసారి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి బిగ్ బాస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సందడి చేశారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె వరస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
అందంతో మతిపోగోడుతున్న బిగ్ బాస్ బ్యూటీ…
తాజాగా అషు రెడ్డి సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇందులో ఈమె పొట్టి నిక్కరు స్లీవ్ లెస్ టైట్ టీ షర్ట్ ధరించి అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. సముద్రంలో పడవపై ప్రయాణం చేస్తూ ఒకవైపు సముద్ర అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు తన అందాలతో అభిమానులకు విందు వడ్డించారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్ లు యధావిధిగా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.



























