Astrologer Venuswamy : జాతకాలను నమ్మే వారు ఉంటారు కొంతమంది అందంతా ట్రాష్ అంటూ తీసి పడేసేవారు ఉంటారు. అయితే బాగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎంత కస్టపడినా ఫలితం కనిపించినపుడు జాతకాల వైపు జనాలు మల్లుతారు. అలా వచ్చిన వారిని క్యాష్ చేసుకోవడం చాలా మంది జోతిష్కులు చేసే పని. అయితే కొంత మంది మాత్రం సెలబ్రిటీలు, రాజకీయనాయకుల జాతకాలను చెబుతూ వైరల్ అవుతుంటారు. అలాంటి వారిలో వేణు స్వామి అనే ఆస్ట్రాలజర్ ఒకరు. ప్రభాస్ కు శని ఉందని ఏ సినిమా ఎలా తీసినా హిట్ కాదంటూ చెప్పిన వేణు స్వామి ఇక పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడని అలానే ఆయన అన్న కూతురు శ్రీజ కూడా మూడో పెళ్లి చేసుకుంటుందంటూ హాట్ కామెంట్స్ చేసారు. తనని తాను ప్రమోట్ చేసుకోడానికి సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి రాజకీయనాయకుల జాతకాల గురించి మాట్లాడారు.

రాహుల్ పెళ్లి చేసుకోడు…
వేణు స్వామి వద్ద ఎంతో మంది సెలబ్రిటీలు జాతకాలు చెప్పించుకుంటారు అంటూ చెప్తుంటారు. బాలకృష్ణ కు ఆ పూజలు చేశాను, రష్మిక మందన్నకి ఆ పూజలు చేశాను అంటూ చెప్పే వేణుస్వామి తాజాగా రాహుల్ గాంధీ గురించి కూడా మాట్లాడాడు. రాహుల్ గాంధీ జాతకం తాను చూసానని తనతో పరిచయం ఉందని చెప్పారు.

తనకి పెళ్లి యోగం లేదని తెలిపారు. ఇక తాను ఎప్పటికీ ప్రధాని కూడా కాలేడని చెప్పారు వేణు స్వామి. ఇక రాహుల్ గాంధీకి సాంబార్ అన్నం అంటే చాలా ఇష్టమట, రోజూ సాంబార్ రైస్ తింటానని చెప్పారట. ఇలా సెలబ్రిటీల గురించి చెబుతూ తనకు తాను బాగానే ప్రమోషన్ ఇచ్చుకుంటున్నాడు.































