Aswini Dutt: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా గుర్తింపు పొందిన అశ్విని దత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకుపోతున్న అశ్వినీ దత్ తన జీవితంలో కూడా ఎన్నో ఎదురు దెబ్బలు చూశానని చెప్పుకొచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో నిర్మాతగా ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఒక సినిమా వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు..ఈ ఇంటర్వ్యూలో అశ్విని దత్ మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత జయాపజయాలు సర్వసాధారణం. అయితే సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తామో పరాజయం ఎదురైనప్పుడు కూడా అంతే దృఢంగా ఉండాలని తెలిపాడు. కానీ ఒకానొక సమయంలో తాను నిర్మించిన సినిమా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవటానికి నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమా. ఆ రోజుల్లోనే శక్తి సినిమాని 40 – 45 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని, కానీ ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ రావటంతో దానివల్ల రూ.32 కోట్ల నష్టపోయానని తెలిపాడు.శక్తి సినిమా వల్ల తన జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలిందని దాంతో సినిమాలు వదిలేసి వెళ్లిపోదాం అనుకున్నానని ఆయన తెలిపారు.

Aswini Dutt: కోట్ల రూపాయలు నష్టపోయాను…
తన కెరీర్‌లో అది మామూలు విషయం కాదన్నారు. అందుకే నాలుగైదేళ్ల పాటు సినిమాలు తీయాలని అనిపించలేదని ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల అశ్వినీ దత్ నిర్మిస్తున్న అన్ని సినిమాలు మంచి హిట్ అందుకొని ఆయనకి లాభాలు కురిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకొణె నటీనటులుగా ‘ప్రాజెక్ట్-కె’ (వర్కింగ్ టైటిల్) మూవీని నిర్మిస్తున్నారు.





























