కరోనా వైరస్ ప్రస్తుతం ఎక్కడ చుసిన ఇదేమాట… యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చెస్తున్న మహమ్మారి కరోనా. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ చేసేశాయి. మరో పక్క ప్రజలు ఇంట్లోంచి అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. మన దేశంలో కూడా ఈ మహమ్మారి ప్రభావం వ్యాపిస్తుంది. రోజు రోజుకు కరోనా భాదితుల సంఖ్య పెరుగుతూవస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. ఇళ్లలోంచి ప్రజలను రావొద్దంటూ విజ్ఞప్తి చేసారు. అయితే కొన్ని సర్వీసులకు మాత్రం వెసులుబాటు కల్పించారు.

మరోవైపు ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చార్జీలు, మినిమం బాలన్స్ చార్జీలను ఎత్తివేశారు. అయినా సరే ఇంట్లోంచి బయటకి వెళ్లి ఏటీఎం లో డబ్బులు తీసుకోవాలన్నా కాస్త రిస్క్ తో కూడుకున్న పనే.. అయితే పలు బ్యాంకులు తమ కస్టమర్లకు డోర్ స్టెప్ డెలివరీ అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఎటిఎం కు వెళ్లకుండా డబ్బులు పొందవచ్చు. ఎస్ బి ఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్రా బ్యాంకులు ఈ డోర్ డెలివెరి సేవలను అందిస్తున్నారు.

ఈ బ్యాంకులలో ఖాతాలు ఉన్న సీనియర్ సిటిజన్స్, దివ్యంగులకు మాత్రమే ఈ సేవలకు అర్హులు. అయితే మెడికల్ ఎమెర్జెన్సీ సమయంలో అందరు కస్టమర్లకు ఈ సేవలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ డోర్ స్టెప్ డెలివరీ సేవలు అందించినందుకు గాను స్టేట్ బ్యాంకు రూ. 100 చార్జ్ చేస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అయితే రూ. 5,000 నుంచి రూ. 25,000 వరకు డబ్బులు ఇంటి వద్దే పొందే అవకాశాన్ని కల్పిస్తుంది ఇందుకు గాను రూ. 100 నుంచి రు.200 వరకు చార్జ్ వాసులు చేస్తుంది. మరో బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాదారులు మాత్రం ఈ సేవను పొందాలంటే కస్టమర్ కేర్ కు కాల్ చేయాల్సిందే.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఈ సేవలను అందిస్తుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంకు లో మాత్రం రూ. 2000 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంది. దీనికోసం ఈ బ్యాంకు రూ.50 నుంచి అత్యవసర పరిస్థితుల్లో డెలివెరీ చేసే అమౌంట్ లో 18% వరకు చార్జీలు వాసులు చేస్తుంది.

































