Babu Mohan : తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆహుతి, అంకుశం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని చాలా తక్కువ సమయంలో కమెడియన్ గా బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు బాబు మోహన్. కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్ జోడి అప్పట్లో ప్రతి సినిమాలోనూ ఉండేది. ప్రతి సినిమాకు వీళ్ళిద్దరు హిట్ కాంబినేషన్. ఇక బ్రహ్మానందం, బాబు మోహన్ కాంబినేషన్ కూడా బాగా హిట్ అయింది. ఇక కచ్చితంగా సినిమాల్లో బాబు మోహన్ కి పాట పెట్టడం ఆనవాయితీ అయిపోయింది.

సౌందర్యకి లేనిపోనివి చెప్పారు…
సౌందర్య మొదటి సినిమా మానవరాలి పెళ్లి, ఆ సినిమా తరువాత ఇతర సినిమాల్లో నటిస్తున్న సౌందర్యను కోడి రామకృష్ణ ప్రాజెక్ట్ అమ్మోరు లో బాగుంటుందని భావించి బాబు మోహన్ గారు ఫోటోలను కోడిరామకృష్ణ కు ఇచ్చారట. ఇక ఆసినిమాలో అలా ఎంపికైన సౌందర్య ఆ సినిమాతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు సినిమాల్లో నటించి హిట్లందుకుంది సౌందర్య. ఇక నాతో పాట చేయాలన్నపుడు చాలా మంది ఒప్పుకోలేదు, ఆపాలని ప్రయత్నించారు.

షూటింగ్ లో వచ్చి ఆపేయమని చెప్పారు. కానీ సౌందర్య, ఆమె తండ్రి ఒకటే చెప్పారు. బాబు మోహన్ పక్కన నటించడం నా కూతురు అదృష్టం అన్నారు. తనకు అమ్మోరు సినిమా అవకాశం ఇప్పించింది నేనే కదా అన్న కృతజ్ఞత చాలా ఉంది. అలాగే నా మీద గౌరవం కూడా ఉంది, ఆయనతో నటించడం నా అదృష్టమనేది. ఎంతో మంది చేయొద్దు అని చెప్పినా సౌందర్య వినలేదు అంటూ బాబు మోహన్ చెప్పారు. ఇక బాబు మోహన్ గారికి చాలా సినిమాల్లో ఒక పాట పెట్టడం ఆనవాయితీగా ఆరోజుల్లో మారిపోయింది. దాదాపు రెండోందల సినిమాల్లో ఆయనకు సోలో పాట ఉండటం విశేషం.



























