Baby cinema director Sai Rajesh : ప్రస్తుతం యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పిస్తున్న సినిమా బేబీ. కథా బలం ఉన్న సినిమాలను ప్రేక్షకులు అందరిస్తారు అనే విషయం ఈ సినిమాతో మరోసారి రుజువయింది. తెలుగు ఆడియన్స్ ఈ మధ్యా కాలంలో కథా బలం ఉండే సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారన్నది ఈ సినిమా మరోసారి నిరూపించింది. బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ నటనకు ప్రశంసలు అందుకుంటుండగా వారితో ఒక కథను చక్కగా చెప్పగలిగిన డైరెక్టర్ సాయి రాజేష్ ను మెచ్చుకుంటున్నారు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సినిమాలో ఆ డైలాగ్ కు క్షమాపణ చెబుతా…
సినిమా యూత్ కే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో ముఖ్యంగా వైష్ణవి చైతన్య క్యారెక్టర్ మీద చాలా మంది కోపం తెచ్చుకునేలా ఆమె పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే కొన్ని సన్నివేశాల్లో మాట్లాడే బూతులు అది కూడా అమ్మాయిలు మాట్లాడే బూతుల గురించి డైరెక్టర్ వివరిస్తూ ఆ సన్నివేశంకు అవసరం అనుకున్నా కనుకే అక్కడ అలాంటి బూతు ఉపయోగించాం.

ఒక్క చోట మాత్రం తెరవాల్సింది కళ్ళు కాదు కాళ్ళు అనే డైలాగ్ వాడకుండా ఉండాల్సింది అనిపించింది. అందుకు క్షమాపణ అడుగుతున్నాను అంటూ డైరెక్టర్ వివరించారు. మిగిలిన చోట్ల కొన్ని అభ్యంతరకర పదాలను సన్నివేశంలో భాగంగా వాడాము అంటూ చెప్పారు. సినిమాకు ఇంత కలెక్షన్ వస్తే చాలు అనుకుంటే ఇప్పటికీ హౌస్ ఫుల్ ఆడుతోంది. సోమవారం అందరూ ఆఫీస్ లకు పోతారు ఇక కలెక్షన్ తగ్గుతుంది అనుకున్నాం కానీ మా అంచనాలు తప్పయ్యాయి అంటూ డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేసారు.