Baby cinema director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ బేబీ సినిమా విశేషాలను అలాగే హీరో, హీరోయిన్లకు సన్నివేశాలను ఎలా వివరించారు వంటి విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

వైష్ణవి మొదట్లో ఒప్పుకోలేదు… బతిమలాడి ఒప్పించా…
యూట్యూబ్ లో ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న వైష్ణవి ఈ సినిమా చూసిన అందరి చేత కన్నీరు పెట్టించింది. హీరోయిన్ కెరీర్ లో ఒకటైన ఇలాంటి కథ చేయాలి అనేలాంటి సినిమాలో చేసిన వైష్ణవి మొదట్లో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. నిజానికి దర్శకుడు సాయి రాజేష్ స్టోరీ చెప్పాక సినిమాలో హీరోయిన్ గా చేయబోతున్నందుకు ఓకే అన్నా కొన్ని సన్నివేశాలను వివరించినపుడు చేయనని చెప్పిందట వైష్ణవి.

లిప్ లాక్ సీన్స్ అలాగే, ఇంటిమేటెడ్ సీన్స్ లో బోల్డ్ గా నటించిన వైష్ణవిని ఆయా సన్నివేశాలలో నటించేందుకు బాగా బతిమలాడి, తన కుటుంబంతో కూడా మాట్లాడి ఒప్పించామని సాయి రాజేష్ తెలిపారు. మొదట్లో భయపడిన తనకు నచ్చజెప్పి అలాగే డైరెక్టర్ మారుతీ చేత కూడా తనను మాట్లాడించి తన కెరీర్ కు భరోసా ఉంటుందని ధైర్యం చెప్పాకనే తాను నటించింది అంటూ చెప్పారు. నేడు తన నటనతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి సాయి పల్లవి దొరికిందని అందరూ భావిస్తున్నారు అంటూ చెప్పారు.































