Baby film fame viraj Ashwin : చిన్న సినిమాగా విడుదల అయి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సినిమా బేబీ. సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా యూత్ కి నచుతుంది అనుకుంటే పెద్ద వాళ్లకు నచ్చి ఫ్యామిలీ తో కలిసి సినినకు వెళ్తున్న సినిమాను వంద కోట్ల దిశగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద సినిమాలను కూడా ఆశ్చర్య పరుస్తూ సినిమా వందకోట్ల క్లబ్బుకు చేరువయింది. ఇక సినిమాలో విరాజ్ గా నటించి మంచి గుర్తింపు అందుకున్న నటుడు విరాజ్ అశ్విన్. ఆయన మొదట ‘అనగనగా ఒక ప్రేమ కథ’తో ఇండస్ట్రీ కి వచ్చి ఓటిటి సినిమా ‘థాంక్యూ బ్రదర్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా పలు ఇంటర్వ్యూ లో పాల్గొని తన వ్యక్తిగత అలాగే కెరీర్ విశేషాలను పంచుకున్నారు.

బేబీ సినిమాలో అలాంటి సీన్స్ చేసేటపుడు…
విరాజ్ బేబీ సినిమాలో సెకండ్ లీడ్ గా చేసి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ వైష్ణవి తో చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమాలో అలాంటి బోల్డ్ సీన్స్ చేసేటపుడు చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ చెప్పారు. డైరెక్టర్ సీన్ వివరించినపుడే ఆ సీన్స్ లేకుండా చేయలేమా అనేది అడిగేస్తాను.

ఖచ్చితంగా సినిమాకు అవసరం అంటేనే చేస్తాను. అధికాక షూటింగ్ అపుడు చాలా మంది ఉంటారు వారందరి ముందు మిగిలిన సీన్స్ చేయడం వేరు లవ్ మేకింగ్ సీన్స్ చేయడం వేరు ఆ ఇబ్బందిని గమనించి డైరెక్టర్ చాలా తక్కువ మందిని ఉండేటట్లు చేసారు. ఇక నాకెంటే కూడా వైష్ణవి కి మరింత ఇబ్బందిగా ఉండి ఉంటుంది. మనతో నటించే ఆర్టిస్ట్ కంఫర్ట్ గా లేకపోయినా కూడా అలాంటి బోల్డ్ సీన్స్ చేయడం చాలా కష్టం అంటూ విరాజ్ తెలిపారు.