మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా తర్వాత ఎమ్మెస్ రాజు ఏ సినిమాను నిర్మిస్తాడని సినీపరిశ్రమ ఎదురు చూస్తుంది. ఆ క్రమంలో ఎమ్మెస్ రాజుకు పరుచూరి బ్రదర్స్ శిష్యుడైన వీరుపోట్ల ఓ కమర్షియల్ ఎలిమెంటున్న స్టొరీ లైన్ చెప్పడంతో ఎమ్మెస్ రాజు కి బాగా నచ్చింది. దానితో ఆ స్టొరీని డెవలప్ చేయమని వీరుపోట్ల తో ఎమ్మెస్ రాజు చెప్పారు.

వీరూ పోట్ల రాసిన స్టోరీ లైన్ కి హిందీలో వచ్చిన తేజాబ్ హిందీ చిత్రానికి కొంత పోలిక ఉంది. కావున ఆ చిత్రంలోని ప్రధాన అంశాలను ఆధారం చేసుకుని వీరుపోట్ల కథ మరింత పకడ్బందీగా రూపొందించాడు. హీరోయిన్, విలన్ కు తెలంగాణ బ్యాక్ డ్రాప్ అయితే బాగుంటుందని అందుకోసం చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ ని ఎంచుకున్నారు.

హీరో ప్రభాస్ కి జోడీగా ఎవరు అయితే బాగుంటుందని అనుకున్నప్పుడు గంగోత్రి సినిమాలో నటిస్తున్నా ఆర్తిఅగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ అయితే సూటబుల్ గా ఉంటుందనుకున్నారు. కానీ ఆమె గంగోత్రి సినిమాతో బిజీగా ఉంది. ఆ క్రమంలో ఎమ్మెస్ రాజు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ తమిళ సినిమా షూటింగ్ లో కనబడ్డ త్రిషని వర్షం మూవీకి బుక్ చేసుకున్నారు.

సినిమాకు హీరో హీరోయిన్స్ బుక్కయ్యారు. విలన్ గా హీరో గోపీచంద్ ను తీసుకున్నారు. అప్పటికే గోపీచంద్ విలన్ గా మెప్పించాడు. ఈ సినిమాను డైరెక్ట్ చేసేదెవరు. అనే సందర్భంలో బాబి సినిమాతో డిసాస్టర్ లో ఉన్న శోభన్ గుర్తుకొచ్చాడు. ఎమ్మెస్ రాజు ఆఫీసు నుండి ఫోన్ వస్తే స్క్రిప్ట్ రైటర్ గా కావచ్చు అని శోభన్ అనుకున్నాడు. కానీ ఏకంగా ఎమ్మెస్ రాజు వర్షం సినిమాని డైరెక్ట్ చేయమంటారని ఊహించలేకపోయాడు. శోభన్ వర్షం సినిమాని సూపర్ హిట్ చేస్తానని ఎమ్మెస్ రాజుకు హామీ ఇచ్చాడు.

సినిమాకి వరంగల్ బ్యాక్ డ్రాప్, ఓ అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్.. ఇక సినిమా ఆడినట్టే అనే మాటలు ఎమ్మెస్ రాజు చెవికి తరచూ వినిపించిన.. ఓ సూపర్ హిట్ సినిమా తీస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ ఆయనలో ఏమాత్రం తగ్గలేదు. చివరికి వర్షం సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అవడంతో అందరి నోళ్ళు మూయించారు.































