హైదరాబాద్ బ్యాడ్మింటన్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని తీసుకొచ్చిన క్రేజీ స్టార్ గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్లో స్టార్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఆమె వివాదాల్లోనూ ముందు
వరుసలో వుంటోంది. నితిన్ చిత్రం ‘ఇష్క్’ టైంలో ఓ పబ్ సాంగ్లో తళుక్కున మెరిసిన గుత్తా జ్వాల ఆ తరువాత “కేవలం నితిన్ కోసమే ఆ పాటలో కనిపించానని, అంతకుమించి తనకు ఏ మాత్రం తెలియదని” చెప్పి వార్తల్లో నిలిచింది. కొన్ని రోజుల తర్వాత కూడా బ్యాడ్మింటన్ పై విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ప్రముఖ తమిళ హీరో విష్ణు విశాల్ తో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ.. మరోసారి వార్తల్లోకొచ్చింది గుత్తా జ్వాల. విశాల్ తనకు మంచి మిత్రుడని చెబుతోంది.

అయితే విష్ణు విశాల్ మాత్రం తన భార్యకు విడాకులిచ్చి కొత్త జోడీ కోసం ఎదురు చూస్తుండటం విశేషం. ఆ నిరీక్షణలో భాగంగానే తరచూ గుత్తా జ్వాలాని కలుస్తూ ప్రత్యేకంగా ఆమె కోసమే హైదరాబాద్ విజిట్ చేస్తున్నాడు విష్ణు విశాల్. దీంతో వీళ్ళిద్దరూ డేటింగ్ లో వున్నారంటుూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈమధ్యనే గుత్తా బర్త్ డే పార్టీకి విష్ణు విశాల్ హాజరు కావడం, ఇద్దరు కలిసి ప్రేమికుల్లా ఫొటోలకు పోజులివ్వడంతో వీరిపై పుకార్లు తారా స్థాయికి చేరాయి. లేటెస్ట్ గా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది గుత్తా జ్వాల. గత కొంతకాలంగా విష్ణు విశాల్ తో డేటింగ్ లో వున్నానని, త్వరలోనే మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని తెలియజేసింది.




























