పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా ని ఎవరైనా మర్చిపోగలరా.. ఆ సినిమా లో డైలాగ్స్, పాటలు ఇప్పటికీ టీవీల్లో మారుమోగిపోతూనే ఉంటాయి.. ఈ సినిమా టీవీ లో వచ్చిందంటే చాలు రేటింగ్ లు కొత్త సినిమా కి ఇచ్చినట్లే ఇస్తారు ప్రేక్షకులు.. అమిషా పటేల్, రేణుదేశాయ్‌లు హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా పూరి జగన్నాధ్ మొదటి చిత్రంగా ఈ సినిమా తెరకెక్కగా అప్పట్లో రికార్డులు తిరగరాసింది.
రమణ గోగుల అందించిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది. అప్పటికీ పవన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా ఓ రేంజ్ లో ఆడగా ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో పవన్‌తో ఓ పాప మాట్లాడుతూ ఉంటుంది. నాకు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ పవన్ తో మాట్లాడిన ఆ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపొయింది.
2017 లో వచ్చిన “పిచ్చి గా నచ్చావ్” సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ పాప ఎవరో కాదు.. నటుడు ఉత్తేజ్ కూతురు చేతన. ప్రస్తుతం చేతన పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.



























