Balagam director Venu : కమెడియన్ గా సినిమాల్లో ప్రయాణం మొదలు పెట్టి నేడు తెలుగు ప్రేక్షకుల మనసు హత్తుకునేలా సినిమా తీసిన డైరెక్టర్ వేణు. కమెడియన్ వేణు నుండి డైరెక్టర్ వేణు గారు వరకు తన ప్రయాణం, తాను పడిన కష్టాలు, ఇబ్బందులు, త్యాగాలు అన్నింటినీ బలగం సినిమా సక్సెస్ అయ్యాక అందరి ప్రశంసలతో మర్చిపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన వేణు యెల్దండి తన బలగం సినిమా ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ఎలా ఆదరిస్తున్నారు, తనకు వస్తున్న వేలాది రివ్యూల గురించి ఇంటర్వ్యూలో తెలిపారు వేణు. అలాగే తన బలగం సినిమా ప్రయాణం మొదటి అడుగు నుండి ఎలా పడిందో ఇంటర్వ్యూలో వివరించారు.

సినిమా వల్ల కుటుంబాలు కలిసిపోయాయి…
సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడంతో సినిమాను గ్రామాల్లో అందరూ కలిసి ప్రొజెక్టర్ మీద ప్రదర్శించి చూస్తున్నారని, ఊరు ఊరంతా కలిసి చూస్తూ ఏడ్చేస్తున్నారు అంటూ వేణు తెలిపారు. సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల అయ్యుంటే బాగా లాభాలు వచ్చుండేవేమో అయితే ఇలా ఇంత మందికి సినిమా రీచ్ అయింది అందుకు సంతోషంగా ఉంది అంటూ తెలిపారు.

సినిమా చూసి చాలా మంది వాళ్ళ చనిపోయిన పెద్దలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నారు. విడిపోయిన కొన్ని కుటుంబాలు కూడా కలిసాయి అందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ తెలిపారు. సినిమాకు మొత్తంగా 4 కోట్ల బడ్జెట్ కాగా అంతకు రెట్టింపు లాభాలు వచ్చాయి. ఓటిటి లో కాకుండా థియేటర్లోనే సినిమా విడుదల అయ్యుంటే ఇంకా లాభాలు వచ్చేవి అంటూ తెలిపారు.































