Balagam Fame Karthanandham : చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి ఇచ్చింది. అలా ఇంతవరకు సరైన గుర్తింపు లేని ఎందరో టాలెంటెడ్ కళాకారులు మరోసారి వెండి తెరకు పరిచయమయ్యారు. అలా నేడు బలగం సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న నటుడు కర్తానందం గారు. జబర్దస్త్ లో చాలా రోజులుగా స్కిట్స్ చేస్తూ నవ్వించిన కర్తానందం గారు బలగంతో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చేసారు. అయితే జబర్దస్త్ వరకు రావడానికి సినిమాల్లో అవకాశల కోసం ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నది తాజాగా ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.

మందుకు బానిసగా మారిపోయాను….
పదోతరగతి చదివే సమయంలోనే నాటకాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కర్తనందం గారు చదివింది ఖమ్మంలో కాగా సూర్యాపేట్ జిల్లా వారు . అయితే ఆర్థిక ఇబ్బందుల వలన పది చదివాక కూలి పనులకు వెళ్లిన ఆయన సినిమాలో ప్రయత్నించమని ఒక ఉన్నత స్థాయి అధికారి సలహా ఇవ్వడంతో అటుగా ప్రయత్నించాలని చెన్నై వెళ్లి బాష రాక బాగా ఇబ్బందులను ఎదుర్కోన్నారట. ఇక ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ ఊరు వచ్చి వ్యాపార చేసిన అందులోనూ నష్టాలను చూడటంతో మందుకు బానిసగా మారిపోయారట.

ఎంగిలి బీడీలు ఎరుకుని తాగే స్టేజ్ కి వెళ్లిపోయారట. ఆ తరువాత ఎంటి నా స్నేహితులు అందరూ పెద్ధ ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్లలో ఒక్కరైనా సహాయం చేయరా అని ఖమ్మం వెళ్లి ప్రయత్నించగా అలా స్నేహితుడి ద్వారా హోమ్ గార్డ్ ఉద్యోగం కళాకారుల కోటాలో వచ్చిందట. అలా నెట్టుకొస్తున్న జీవితంలో చాకలి ఐలమ్మ సినిమాలో వేషం వేయడం ద్వారా జబర్దస్త్ రాజమౌళి పరిచయం అయి అలా జబర్దస్త్ వెళ్లానంటూ తన ప్రస్థానం చెప్పారు కర్తానందం గారు. ఇక జబర్దస్త్ లో వేణు గారి టీంలో మొదట అవకాశం వచ్చిందని అలానే బలగం కూడా తాను ఇచ్చిన అవకాశం అంటూ తన ఋణం తీర్చుకోలేను అంటూ తెలిపారు.



























