Balagam fame Muralidhar : ఉద్యగంలో రిటైర్డ్ అయ్యాక నటన మీద ఆసక్తితో సీరియల్స్ వైపు వెళ్లి అలా సినిమాల్లోనూ అవకాశాల కోసం తిరుగుతూ చిన్న చిన్న సినిమాల్లో చిన్న పాత్రలను కూడా చేసిన మురళీధర్ గారు ‘డిజే టిల్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కథనాయకుడు, మహానాయకుడు, వినవయ్య రామయ్య, పిట్ట కథలు వంటి సినిమాల్లో నటించిన మరింత మంచి పేరు నటనకు తెచ్చింది మాత్రం ‘బలగం’ సినిమానే. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు రెండు రాష్ట్రాల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. నగరాలు, గ్రామాలు అని తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా బలగం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుకీ మంచి పేరు అలాగే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ గారు సినిమా గురించి అందులో అవకాశం ఎలా వచ్చింది వంటి విషయాలను అలాగే తన కెరీర్ లో తాను పడిన ఇబ్బందులను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

చిన్నతనం నుండి పేదరికమే…
మురళీధర్ గారు ఆయన జీవితం, కెరీర్ అలాగే తాను పడిన కష్టాల గురించి మాట్లాడుతూ చిన్నతనం నుండి కటిక పేదరికం అనుభవించానని, ఇంట్లో రూపాయి కూడా ఉండని రోజులు చూసానని తెలిపారు. అందుకే ఇప్పటికీ ఆర్థికంగా బాగున్నా కూడా ఇప్పటికీ ఆ పేదరికమే అనుభవిస్తున్నాను అంటూ తెలిపారు. ఇప్పుడు యాభై వేలు ఉన్నా అంత ఖర్చు పెట్టినా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి.

అయినా కూడా తాను ఖర్చు పెట్టనని, ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే కూడా ఆలోచిస్తానని చెప్పారు. ఇక సమయపాలన ఖచ్చితంగా పాటిస్తానని, ఇది నేను ఎన్టీఆర్ గారి నుండి నేర్చుకున్నానని ఆయన నాకు అభిమాన నటుడు అవడం వల్ల అయనలాగా క్రమశిక్షణతో ఉండటం నేర్చుకున్నానని, ఇప్పటికీ అలానే ఉన్నానని తెలిపారు మురళీధర్ గారు.



























